• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాటిదార్ల ఆందోళనకు కేశూభాయి పూర్తి మద్దతు: పూల్స్ ఎలా ఉంటారో చూపుతాం.. హార్దిక్‌కు ‘వై’ సెక్యూరిటీ

By Swetha Basvababu
|

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చినందుకు బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ గట్టి షాకిచ్చారు. తమ ఆందోళనకు బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం కేశూభాయి పటేల్ పూర్తి మద్దతు ఇచ్చారని చెప్పారు.

రాహుల్ గాంధీ, అల్పేశ్ ఠాకూర్‌, జిగ్నేశ్ మేవానీలతోపాటు తనకూ బీజేపీని ఓడించడమే ప్రధాన ఎజెండా అని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ల అమలు 50 శాతానికి మించకూడదని, అయితే ఇది అసాధ్యం కానిదేమీ లేదన్నారు. ఎప్పుడు ఏ కొత్త చట్టం తీసుకొచ్చినా న్యాయస్థానం సమీక్షిస్తుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

రిజర్వేషన్ల కల్పనే తమకు ముఖ్యమన్న హార్దిక్

రిజర్వేషన్ల కల్పనే తమకు ముఖ్యమన్న హార్దిక్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో పాటిదార్లను ‘ఫూల్స్'ను చేసిందన్న డిప్యూటీ సీఎం నితిన్ భాయి పటేల్.. పాటిదార్లందరినీ ఫూల్స్‌ను చేశారని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఫూలిష్‌నెస్ ఏమిటో చూపుతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ సంస్థ తరఫున సీట్లు ఇవ్వమని ఎప్పుడూ అడుగలేదన్నారు. అయితే ఆరోపణలు, ప్రత్యారోపణలు ముఖ్యమేనన్నారు. కొంత మంది తనపై విమర్శలు చేస్తున్నారని, అయితే తమకు కావాల్సింది రిజర్వేషన్లనీ చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించనప్పుడు.. తమకు రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ముఖ్యమని హార్దిక్ పటేల్ తేల్చి చెప్పారు.

కేశూభాయి పటేల్ ఆరాధ్యనీయ నేత

కేశూభాయి పటేల్ ఆరాధ్యనీయ నేత

క్షత్రియ ఠాకూర్, పాటిదార్ల మధ్య సమస్యల్లేవని, తామంతా కలిసే ఉన్నామని హార్దిక్ పటేల్ తెలిపారు. అభ్యర్థులుగా పోటీ చేసిన ఠాకూర్లకు పాటిదార్లు కూడా తప్పనిసరిగా ఓటేస్తారని చెప్పారు. పలుసార్లు తమ టీం సభ్యులు చాలా ఆసక్తిగా చెప్పినా మీడియా తప్పుగా వక్రీకరించిందన్నారు. కేశూభాయి చాలా సీనియర్ నేత, ఆరాధ్యనీయుడని, తానూ ఆయన తర్వాతేనని హార్దిక్ పటేల్ చెప్పారు. కేశూభాయి పటేల్‌ను బీజేపీ ఎప్పుడో వదిలేసిందన్నారు. పటేళ్లకు రిజర్వేషన్ కోసం తాము చేపట్టిన ఆందోళనకు ఆయన పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిందన్నారు. రిజర్వేషన్ల విషయమపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించడానికి బదులు తమ కమిటీ చర్చించడమే బెటరని అన్నారు.

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీవీ దాదాగిరి రాజకీయాలిలా..

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీవీ దాదాగిరి రాజకీయాలిలా..

వచ్చేనెల 18న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రస్తుత మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా రిజర్వేషన్ల ఆందోళనకు మద్దతునిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 22 ఏళ్ల కుర్రాడి వ్యాఖ్యలపై రాష్ట్ర డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ప్రత్యారోపణలు చేయడంతోనే తాను చిన్న వాడిని కాదని తేలిపోయిందన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సరైన విపక్షం అని భావించినందు వల్లే, తానూ ఆ స్థానంలో ఉన్నందునే మద్దతు ఇచ్చామన్నారు. పాటిదార్లకు రిజర్వేషన్, నిరుద్యోగ సమస్య పరిష్కారంతోపాటు రైతు రుణాల మాఫీ అన్నవే తమ డిమాండ్లన్నారు. బీజేపీ హయాంలో దాదాగిరి రాజకీయాలేనని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ‘వై’ క్యాటగిరీ సెక్యూరిటీ

ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ‘వై’ క్యాటగిరీ సెక్యూరిటీ

ఎట్టకేలకు పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ ‘వై' క్యాటగిరి సంపాదించుకోనున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. దీంతో ఆయన వెంటనే 11 మంది భద్రతాగార్డులు ఉంటారు. వీరికి అదనంగా మరో ఇద్దరు భద్రతాధికారులు ఉంటారు. అయితే పాటిదార్ల ప్రాంతాల్లో మద్దతునిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయబోమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్ - హార్దిక్ పటేల్ మధ్య సంబంధాలపై నితిన్ పటేల్ స్పందిస్తూ రెండేళ్లుగా వారిద్దరి మధ్య గూడుపుఠాణి జరుగుతున్నదని, ఇప్పుడు బయటపడిందన్నారు. కొంత మంది ఫూల్స్ (కాంగ్రెస్) చేసిన ప్రతిపాదనను మరికొందరు ఫూల్స్ నమ్మారని ఎద్దేవా చేశారు. ఇది గత రెండేళ్లలో పెద్ద జోక్ అని అభివర్ణించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AHMEDABAD: Patidar Anamat Andolan Samiti (PAAS) head Hardik Patel has been facing an attack from BJP which says his understanding with Congress on quota Patels outside the 50 per cent limit is legally not tenable. His alliance with Congress, the equations with Rahul Gandhi, Alpesh Thakor and how defeating BJP is topmost on his agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more