వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వత్రా హర్షం- స్వాగతించిన సిద్ధూ, అమరీందర్-మోడీకి ధ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తూ ఇవాళ ప్రధాని మోడీ కీలక నిర్ణయం ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తలుగుతుండటం, వచ్చే ఏడాది కీలక ఎన్నికలు ఉండటంతో వీటిపై వ్యవసాయ చట్టాల ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ ప్రకటించిన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని పంజాబ్ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ముఖ్యంగా పంజాబ్ పీసీసీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ, అలాగే మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్లు పెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి వెల్లడికాకముందే సిద్ధూ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కాంగ్రెస్ నుంచి తప్పుకుని సొంత పార్టీతో ముందుకెళ్తున్న కెప్టెన్ అమరీందర్ కూడా వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై ప్రధానికి థ్యాంక్స్ చెప్పడం విశేషం.

navjot singh sidhu and amarinder singh welcome repealment of farm laws by centre

ముందుగా ప్రధాని నిర్ణయంపై ట్వీట్ చేసిన పంజాబ్ పీసీసీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ... నల్లచట్టాల్ని రద్దు చేస్తూ సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రధానిని ప్రశంసించారు. కిసాన్ మోర్చా చేసిన సత్యాగ్రహం చారిత్రక విజయం సాధించిందంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీ త్యాగాలకు ఫలితం దక్కిందంటుూ రైతుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పంజాబ్ లో తిరిగి వ్యవసాయాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధఁ చేస్తుందంటూ సిద్ధూ ట్వీట్ లో పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని మోడీ ఇవాళ ప్రకటించిన నిర్ణయాన్ని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా స్వాగతించారు. ఆయన తన ట్వీట్ లో ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. గ్రేట్ న్యూస్... ప్రతీ పంజాబీ డిమాండ్ ను నెరవేర్చినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు. గురునానక్ జయంతి సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయనకు సరైన నివాళి అని కూడా అభివర్ణించారు. రైతుల బాగు కోసం కేంద్రం పనిచేస్తుందని తాను ఆశిస్తున్నట్లు కెప్టెన్ అమరీందర్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే రైతుల్లేకుంటే తిండి లేదంటూ కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

English summary
punjab pcc cheif navjot singh sidhu and former cm captain amarinder singh has welcomed pm modi's decision to repeal three farm laws today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X