డ్రగ్స్ వ్యాపారులతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లింకులు; ఆ ఫోటోలను పోస్ట్ చేసి నవాబ్ మాలిక్ సంచలనం !!
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో మహారాష్ట్రలో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేయడమే కాకుండా, కేంద్రంలోని బిజెపి సర్కార్ ను, మహారాష్ట్రలో గతంలో పాలన సాగించిన బీజేపీ సర్కార్ ను, నాటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను, బిజెపి నాయకులను టార్గెట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇక తాజాగా డ్రగ్స్ ముఠాతో బిజెపికున్న లింక్ లపై ట్విట్టర్ వేదికగా ఆయన సంచలన పోస్ట్ లు చేశారు.
జయదీప్ రాణా దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్‌తో ఉన్న ఫోటో ట్వీట్
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాదకద్రవ్యాల వ్యాపారి జయదీప్ రాణా అమృత ఫడ్నవీస్‌తో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు .అతనికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2018లో అమృత ఫడ్నవీస్ నది గీతం ప్రాజెక్ట్ రికార్డింగ్ సమయంలో ఈ చిత్రం తీయబడిందని ఈ ప్రాజెక్ట్‌కి ఫైనాన్స్ హెడ్ రానా అని నవాబ్ మాలిక్ తెలిపారు. విలేకరుల సమావేశంలో నవాబ్ మాలిక్ మాట్లాడుతూ,"మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న జయదీప్ రాణాకు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేతలపై బాంబు పేల్చారు.

డ్రగ్స్ రాకెట్‌లో ఎన్‌సిబి అధికారి కింగ్‌పిన్, ఫడ్నవీస్ హయాంలోనే సమీర్ వాంఖడే నియామకం
మాజీ సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ పాడిన ప్రసిద్ధ నది పాటకు అతను ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు అని, గతంలో సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం బాగా పెరిగిందని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ముంబైలో నడుస్తున్న డ్రగ్స్ రాకెట్‌లో ఎన్‌సిబి అధికారి కింగ్‌పిన్ అని, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌చే నియమించబడ్డాడని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడేపై తాజాగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై నవాబ్ మాలిక్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించడం వంటి అనేక ఆరోపణలను ఇప్పటికే చేసిన విషయం తెలిసిందే.

సమీర్ వాంఖడే ను టార్గెట్ చేసిన నవాబ్ మాలిక్ ..నకిలీ సర్టిఫికెట్లు, ముస్లిం అంటూ ఆరోపణలు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ లో ఆర్యన్ ఖాన్ ను ఈ కేసు నుండి తప్పించటానికి ఎన్సీబీ అధికారులు 25 కోట్ల రూపాయల డీల్ మాట్లాడారని చెప్పటంతో సమీర్ వాంఖడే అవినీతి అధికారి అని, దీంతో సమీర్ వాంఖడే వ్యక్తిగత జీవితాన్ని డ్రగ్స్ కేసుతో లింక్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. సమీర్ వాంఖడే పుట్టుకతో ముస్లిం అని, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు తయారుచేయించి, ఒక దళితుడికి రావలసిన ఉద్యోగాన్ని కాజేశారని విమర్శించారు నవాబ్ మాలిక్. ఇక సమీర్ వాంఖడేపై ఆరోపణల నేపధ్యంలో ఆయనపై విజిలెన్స్ విచారణ చేపట్టింది ఎన్సీబీ.

డ్రగ్స్ కేసుకు బీజేపీకి లింక్ .. బాలీవుడ్ పై బీజేపీ కుట్ర
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో 25 కోట్ల డీల్ ఆరోపణలతో సమీర్ వాంఖడే ను టార్గెట్ చేసిన మహా మంత్రి ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టటం లేదు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో బాలీవుడ్‌ను మహారాష్ట్ర నుండి తరలించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఎన్సిపి నాయకులు పదే పదే విమర్శిస్తున్నారు. మరోపక్క శివసేన కూడా ఈ కేసులో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పిస్తోంది. ఇది బాలీవుడ్ పరువు తీసేందుకు బిజెపి చేసిన కుట్ర" అని నవాబ్ మాలిక్ అన్నారు.అక్టోబర్ 2న గోవాకు బయలుదేరిన క్రూయిజ్ షిప్‌లో జరిగిన ఆపరేషన్ మొత్తం ఫేక్ ఆపరేషన్ అని ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ పదేపదే పేర్కొన్నాడు.

నవాబ్ మాలిక్ ఆరోపణలతో సమీర్ వాంఖడేకు తలనొప్పులు
మరోవైపు ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లాను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. సమీర్ వాంఖడే కుల ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశారని నవాబ్ మాలిక్ ఆరోపించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఇదిలా ఉంటే అక్టోబరు 2న ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డాడు. డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడడంతో అది కాస్త రాజకీయ దుమారంగా మారింది. మహారాష్ట్ర మంత్రులు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులను టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇటీవల ఆర్యన్ ఖాన్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అయినప్పటికీ డ్రగ్స్ కేసులో రచ్చ కొనసాగుతూనే ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications