Karnataka Elections 2023: కర్ణాటకలో కాంగ్రెస్‍కు షాకిచ్చిన ఎన్సీపీ.. !
కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. మిత్ర పక్షమైమన ఎన్సీపీ కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించాలని శరద్ పవార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలతో శరద్ పవార్ భేటీ అయి తామంతా ఒక్కటేనంటూ ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలిసి ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో ఎన్సీపీ పోటీ చేయడంపై ఆసక్తి నెలకొంది.
బెలగావి జిల్లాలో క్రియాశీల రాజకీయ సంస్థ అయిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES) కూడా తాను పోటీ చేయని స్థానాల్లో NCPకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వారి మధ్య చర్చలు జరుగుతున్నట్లు మరో రెండు రోజుల్లో నిర్ణయం తెలుపుతామని మహారాష్ట్ర ఏకీకరణ సమితి పేర్కొంది. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ఎంఈఎస్ పోటీ చేస్తుందని, ఐదు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు ఎంఈఎస్ నేత మనోహర్ కినేకర్ చెప్పారు.

కర్ణాటకలో ఎన్సీపీ పోటీ చేయడం మిత్రపక్షం కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యే ఎన్సీపీ జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఎన్సీపీ ఈసీ క్లాక్ గుర్తు కేటాయించింది. ఎన్సీపీ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో మరాఠా జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయనుంది. శరద్ పవార్ అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్ విషయంలో పవార్, విపక్షాల(కాంగ్రెస్ నేతృత్వంలోని) నుంచి విభేదిస్తున్నారు.
గురువారం సాయంత్రం పవార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. బీజేపీపై పోరుకు విపక్షాల ఐక్యత పేరిట ఒక్కటిగా ముందుకు సాగాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్క రోజులోనే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే నిర్ణయం ఎన్‌సీపీ తీసుకోవడం చర్ఛనీయంశంగా మారింది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications