వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ రాజధాని ఢిల్లీ లో నైట్ కర్ఫ్యూ ... ఏప్రిల్ 30 వరకు, కరోనా కట్టడికి కేజ్రీ సర్కార్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది . ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యాలని పేర్కొంది .

భారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలుభారత్ లో కరోనా ఉధృతి .. 97 వేలకు చేరువగా కొత్త కేసులు , 446 మరణాలు

 కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ

కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ

ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా, ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నట్లు గా పేర్కొంది . కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీలో విజృంభిస్తున్న కారణంగా కేజ్రీవాల్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.

కరోనావైరస్ మహమ్మారి నియంత్రించడానికి ఢిల్లీలో కర్ఫ్యూను తిరిగి తీసుకురావాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి నగర పరిపాలన ఉన్నతాధికారులు పంపారు. ఈ ప్రతిపాదనపై సిఎం ఆమోదం తెలిపారు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది .

రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ

రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ


ఈ నేపధ్యంలో , రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నైట్ కర్ఫ్యూ లో భాగంగా గతంలో అనుసరించిన విధానంలానే అవసరమైన సేవలు మరియు అత్యవసర రవాణా అనుమతించబడతాయని అధికారులు తెలిపారు. కరోనా

మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో లాక్డౌన్ ఒక పరిష్కారం కాదని కేజ్రీవాల్ ఇటీవలే నొక్కి చెప్పారు. ఏప్రిల్ 2 న, ప్రభుత్వం ఎటువంటి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. తాము ఆ విధంగా లాక్ డౌన్ చేయాలనుకుంటే ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని ఢిల్లీ సర్కారు తేల్చిచెప్పింది.

ఢిల్లీలో గత 24 గంటల్లో 3,548 తాజా కేసులు, 15 మరణాలు

ఢిల్లీలో గత 24 గంటల్లో 3,548 తాజా కేసులు, 15 మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 3,548 తాజా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి.


రాత్రి కర్ఫ్యూ సమయంలో, ట్రాఫిక్ నియంత్రణ లేదని టీకాలకు వెళ్లే వారిని ఇ-పాస్ తో అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

అవసరమైన సేవల్లో ఉన్నవారు మరియు రేషన్, కిరాణా నిల్వలు, కూరగాయలు, పాలు మరియు మందుల కోసం చిల్లర వ్యాపారులు కూడా ఇలాంటి పాస్‌లతో అనుమతించబడతారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క జర్నలిస్టులు కూడా తమ విధుల నేపధ్యంలో అనుమతించబడతారు .

అత్యవసరాలకు, వైద్య సేవలకు మినహాయింపులు , కరోనా కట్టడి కోసం కేజ్రీ సర్కార్ నిర్ణయం

అత్యవసరాలకు, వైద్య సేవలకు మినహాయింపులు , కరోనా కట్టడి కోసం కేజ్రీ సర్కార్ నిర్ణయం

ప్రైవేట్ వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సిబ్బందికి ఐడి కార్డులతో కర్ఫ్యూ సమయాల్లో అనుమతిస్తారు.

గర్భిణీ స్త్రీలకు మరియు చికిత్స అవసరమైన వారికి కూడా మినహాయింపులు ఇవ్వబడతాయి.

అవసరమైన సేవలను కాకుండా ప్రజల కదలికలను నియంత్రించటం , తద్వారా కరోనా కట్టడి చేయటం కోసమే నైట్ కర్ఫ్యూ అమలు చేయబడుతుందని ఢిల్లీ ప్రభుత్వం తన ఉత్తర్వులో తెలిపింది.

English summary
Delhi government imposes night curfew from 10pm to 5am till April 30 amid rising Covid-19 cases. This is the toughest order by the Delhi government since a fresh surge in coronavirus infections in the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X