ముకేశ్ అంబానీతో పెళ్లికి నీతా షరతు! ఇద్దరి బంధం కుదిరిందిలా..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్న సంగతి తెలిసిందే. అయితే వీరి నడుమ బంధం ఎలా కుదిరిందో తెలుసా? ఇటీవల జరిగిన రిలయన్స్ గ్రూప్ 40 ఏళ్ల ఉత్సవంలో తన కుటుంబానికి చెందిన కొన్ని విషయాలను ముకేశ్ అంబానీయే స్వయంగా వెల్లడించారు.
తన భార్య నీతా ఉపాధ్యాయురాలిగా పనిచేసిందని.. తాను రిలయన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టకపోయి ఉంటే ప్రపంచ బ్యాంకులో పనిచేసేవాడినని, లేదా ఏదైనా యూనివర్సిటీలో టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండి ఉండేవాడినని చెప్పారు.

నీతా తన ఐదేళ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నారు. నార్సి మోంజీ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ నుంచి ఆమె డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ఓ పాఠశాలలో టీచర్‌గా చేరారు.
ఒకవైపు ఉపాధ్యాయురాలిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు దేశవ్యాప్తంగా భరతనాట్య ప్రదర్శనలిచ్చేవారామె. ఓసారి ఓ ప్రదర్శనలో ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ నీతాను చూశారు.
తన కొడుకు ముకేశ్‌కు ఆమె సరైన జోడీ అని నిశ్చయించుకుని నీతా తల్లిదండ్రులతో మాట్లాడారు. ముకేశ్‌కి కూడా నీతా నచ్చింది. అయితే పెళ్లికి ఆమె ఓ షరతు పెట్టింది. వివాహం అనంతరం తాను టీచర్ వృత్తిని కొనసాగిస్తానని చెప్పింది.
దీనికి ముకేశ్ అంగీకరించడంతో వారిద్దరి వివాహం జరిగింది. చెప్పినట్లుగానే పెళ్లి తరువాత కూడా నీతా కొద్ది నెలల వరకు టీచర్‌గా పనిచేసింది. ఆ తరువాత రిలయన్స్ వ్యాపారంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications