వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో మనీ ఫర్ టెర్రర్.. అన్ని దేశాలు ఉగ్రవాదంపై సమిష్టి పోరాటం చెయ్యాలి: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ' నో మనీ ఫర్ టెర్రర్' అనే అంశంపై నేడు న్యూఢిల్లీలో మొదలైన మూడవ మంత్రుల సదస్సులో ప్రధాన మంత్రి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఉగ్రవాదంపై పోరాటంలో విశ్రమించబోము

ఉగ్రవాదంపై పోరాటంలో విశ్రమించబోము


ఈ సదస్సు భారతదేశంలో జరగడం విశేషం అని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్దాలుగా వివిధ పేర్లతో, వివిధ రూపాలలో ఉగ్రవాదం భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని, వేల సంఖ్యలో భద్రతా బలగాల, సామాన్య పౌరుల విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నామని, అయినప్పటికీ ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నామని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదం కారణంగా పోయిన ప్రాణాలు చాలా విలువైనవి అని పేర్కొన్న మోడీ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు విశ్రమించబోమని ఈ సందర్భంగా తెలిపారు.

ఉగ్రవాదంపై అన్ని దేశాల వాళ్లు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం

ఉగ్రవాదంపై అన్ని దేశాల వాళ్లు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం


ఇది చాలా ముఖ్యమైన సమావేశమని పేర్కొన్న ఆయన, దీనిని కేవలం మంత్రుల సమావేశంగా చూడకూడదని స్పష్టం చేశారు. అసలు ఉగ్రవాదానికి మూలమైన టెర్రర్ ఫండింగ్ పై దెబ్బకొట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి అన్ని దేశాల వాళ్లు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవత్వం పైన, మనిషి స్వేఛ్చ పైనా మరియు నాగరికత పైన జరుగుతున్న దాడిగా పేర్కొన్న ప్రధాని మోడీ, ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి ఏకీకృత విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాద నెట్ వర్క్ లను విచ్చిన్నం చెయ్యాలి.. వారి ఆర్ధిక వ్యవస్థను నాశనం చెయ్యాలి

ఉగ్రవాద నెట్ వర్క్ లను విచ్చిన్నం చెయ్యాలి.. వారి ఆర్ధిక వ్యవస్థను నాశనం చెయ్యాలి


టెర్రరిస్టులతో పోరాడటం, ఉగ్రవాదంపై పోరాటం రెండు భిన్నమని పేర్కొన్న ఆయన, టెర్రరిస్టులను ఆయుధాలతో మట్టుపెట్టవచ్చునని, కానీ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి చురుకైన ప్రతిస్పందన కావాలని, సమిష్టిగా చేసే వ్యూహం అవసరమని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు ఉగ్రవాద నెట్వర్క్ లను విచ్ఛిన్నం చేయాలని, వారి ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు పలు మార్గాల ద్వారా డబ్బు సమకూర్చుకుంటున్నారన్న విషయం తెలిసిందేనని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని వారికి రాజకీయంగా, సైద్ధాంతికంగా అండగా నిలవడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలపై ఒత్తిడి తేవాలి .. టెర్రర్ ఫండింగ్ అరికట్టాలి

ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలపై ఒత్తిడి తేవాలి .. టెర్రర్ ఫండింగ్ అరికట్టాలి

ఈక్రమంలోనే ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని, ఉగ్రవాదుల పట్ల సానుభూతిని వ్యక్తం చేసే సంస్థలు, వ్యక్తులను ఒంటరి చేయాలని మోడీ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా టెర్రర్ ఫండింగ్ మరియు రిక్రూట్మెంట్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, డార్క్ నెట్ ఇందులో కీలకంగా మారిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇక మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉగ్రవాదాన్ని ట్రాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అందరూ సమిష్టిగా ఒకే విధానంతో పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రారంభోపన్యాసం లో తెలిపారు.

English summary
No Money for Terror.. Prime Minister Modi made key comments on terrorism at the international conference. It is suggested to wage a united fight against terrorism, break their networks and destroy their economic system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X