Ex-lover blackmail: ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ లకు నేను రెఢీ, నగ్న వీడియోలతో టార్చర్, థర్డ్ డిగ్రీతో !
చెన్నై/ తిరువళ్లూరు: భర్తతో విడాకులు తీసుకున్న మహిళ ఒంటరి జీవితం గడుపుతూ ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో యువతి పని చేస్తున్న సెల్ ఫోన్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. రెండేళ్లు ఆమెతో ఆ యువకుడు ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. ప్రియురాలిని మోసం చేసి వేరే యువతిని పెళ్లి చేసుకున్న ప్రియుడు ఆమెను నిలువునా మోసం చేశాడు. ఇప్పుడు తనను రెండో పెళ్లి చేసుకోవాలని డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ చెయ్యడానికి నేను రెఢీగా ఉన్నానని, లేదంటే నీ నగ్న ఫోటోలు పొర్న్ వెబ్ సైట్ లో పోస్టు చేస్తానని మాజీ ప్రియురాలిని టార్చర్ పెట్టాడు. ఆమె ఏటీఎం కార్డులు, బంగారు నగలు లక్కోన్ని వెళ్లి అడ్డంగా బుక్కైనాడు. మేము థర్డ్ డిగ్రీ చెయ్యడానికి రెఢీగా ఉన్నామని మామలు (పోలీసులు) పిలిచి మర్యాద చేశారు.

భర్తతో విడాకులు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా అలమాది ప్రాంతంలో నివాసం ఉంటున్న మీనాక్షి (పేరు మార్చాం) అనే యువతి (27)కి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జోసెఫ్ తో 2013లో వివాహం అయ్యింది. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త జోసెఫ్ టార్చర్ ఎక్కువ అయ్యింది. పెద్దలు పంచాయితీలు చేసినా మీనాక్షి కాపురం నిలబడలేదు. ప్రతిరోజు భార్య జోసెఫ్ తో మీనాక్షికి గొడవలు ఎక్కువ కావడంతో చివరికి ఆమె విడాకులు తీసుకుంది.

కంపెనీ మేనేజర్ తో టచ్
భర్త జోసెఫ్ నుంచి విడాకులు తీసుకున్న మీనాక్షి తల్లి పుష్పరాణితో కలిసి ఉంటూ అంబత్తూరులోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో గత మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నది. అదే సెల్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జగదీష్ (29) అనే యువకుడితో మీనాక్షికి పరిచయం అయ్యింది. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మీనాక్ష మీద జగదీష్ కన్ను వేశాడు.

రెండేళ్లు జగదీష్ జల్సాలు
రెండు సంవత్సరాల క్రితం మీనాక్షిని ముగ్గులోకి దింపిన జగదీష్ ఆమెకు ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. భర్తతో విడాకులు తీసుకున్న మీనాక్షి తనకు జీవితంలో ఒకతోడు అవసరం అని భావించి జగదీష్ ను గుడ్డిగా నమ్మింది. అంతే కంపెనీలో పని పూర్తి అయిన తరువాత ప్రతిరోజు సాయంత్రం బయటకు వచ్చిన తరువాత జగదీష్ ప్రియురాలు మీనాక్షితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇద్దరు అప్పటి నుంచి శారీరకంగా కలవడంతో మొదలు పెట్టారు. అదే సమయంలో జగదీష్ ప్రియురాలు మీనాక్షి నగ్నంగా అతనితో బెడ్ రూంలో ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించాడు.

హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేసుకున్న ప్రియుడు
2018లో మీనాక్షిని కాదని మోసం చేసిన జగదీష్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ప్రియురాలు మీనాక్షికి తెలీకుండా జగదీష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల క్రితం జగదీష్ కు వివాహం అయ్యిందని, తనను మోసం చేశాడని తెలుసుకున్న మీనాక్షిఅతనికి దూరం అయ్యింది. అప్పటి నుంచి మీనాక్షిని శారీరకంగా అనుభవించాలని జగదీష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కు రెఢీ
ఆరు నెలల నుంచి ప్రియురాలు దూరం కావడంతో జగదీష్ రగిలిపోయాడు. తనను రెండో పెళ్లి చేసుకోవాలని, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ చెయ్యడానికి తాను రెఢీగా ఉన్నానని మీనాక్షిని వేధింపులకు గురి చేశాడు. రెండో పెళ్లి చేసుకోనని మీనాక్షితేల్చి చెప్పింది. తనను రెండో పెళ్లి చేసుకోకుంటే నీవు నాతో బెడ్ రూంలో గడుపుతున్న సమయంలో తీసిన నగ్న వీడియోలు, ఫోటోలు పొర్న్ వెబ్ సైట్లలో పోస్టు చేస్తానని, తరువాత నీకు ఆత్మహత్య చేసుకునే చాన్స్ తప్పా మరో గత్యంతరం ఉండదని జగదీష్ ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

థర్డ్ షిఫ్ట్ కు రెఢీ అయిన పోలీసులు
మాజీ ప్రియురాలు మీనాక్షిని బ్లాక్ మెయిల్ చేస్తున్న జగదీష్ వారం రోజుల నుంచి నేరుగా ఆమె ఇంటికే వెళ్లి రెండో పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మాజీ ప్రియురాలు మీనాక్షి ఏటీఎం కార్డు, క్రిడిట్ కార్డు, బంగారు నగలు లాక్కొని పరారైనాడు. మాజీ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పింది. పోలీసులకు మండిపోవడంతో తాము థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి రెఢీగా ఉన్నామంటూ జగదీష్ ను పట్టుకుని బెండ్ తీసి అతని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications