ఏకంగా మహిళా మంత్రి బ్యాగే కొట్టేశారు: క్యాష్, ఫోన్, ఐడీ కార్డు సహా..

Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్‌: సామాన్య వ్యక్తుల దగ్గర దొంగలు వస్తువులు దొంగలించడం చూశాం.. కానీ, ఏకంగా ఓ మంత్రి వద్దే కొందరు దొంగలు తమ చేతివాటం చూపిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పూరి-దుర్గ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒడిశా మంత్రి ఉషా దేవి హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగలు అపహరించుకుపోయారు.

భువనేశ్వర్‌ నుంచి ఆమె వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైరఖోల్‌- అంగుల్‌ స్టేషన్ల మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ అపహరణకు గురైనట్లు ఆమె గుర్తించారు.

Odisha Minister's bag stolen from train

మంత్రి ఉషాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తితాల్‌గఢ్‌ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఇంఛార్జీ మోహన్‌ నాయక్‌ తెలిపారు. కాగా, హ్యాండ్‌ బ్యాగ్‌లో రూ.25వేల నగదు, మొబైల్‌ ఫోన్‌, మంత్రి ఐడీ కార్డుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్లు మంత్రి ఉషాదేవి తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Odisha Minister Usha Devi's vanity case containing Rs 25,000 in cash, a mobile phone, ID card and other valuables was allegedly stolen by miscreants on board an express train, said police on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి