ప్రేమికుల రోజు షాక్, మూడు రోజులు లిక్కర్ బ్యాన్, ఐటీ హబ్ లో ఆర్డర్, అంతేనా !
ప్రేమికుల రోజు సంవత్సరానికి ఒక్కరోజు వస్తోంది. ప్రతి ఏడాది వచ్చే ప్రేమికుల రోజు కోసం ప్రేమికులు, వన్ సైడ్ లవర్స్ చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. ప్రేమికుల రోజు పార్క్ లు, సినిమా థియేటర్లు, మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లే వాళ్లతో కిటకిటలాడుతుంటుంది. ప్రేమికుల రోజు సిటీల్లో అయితే యువతి, యువకులు నానా హంగామా చేస్తుంటారు.
ఐటీ హబ్ బెంగళూరులోని పబ్ ల్లో ప్రేమికుల రోజు సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. బెంగళూరులో ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలకు వెళ్లే వారి కోసం ఇప్పటికే టిక్కెట్లు విక్రయించేశారు. అయితే ప్రేమికుల రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేసిన నిర్వహకులతో పాటు మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ప్రేమికుల రోజు మద్య నిషేధం విధించారు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు నగరంలో మూడు రోజుల పాటు మద్య నిషేధం విదిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో మూడు రోజుల పాటు ఎక్కడా మద్యం విక్రయాలు ఉండకూడదని ఎన్నికల శాఖ అధికారులు పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు బెంగళూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం వెల్లడించింది. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫిబ్రవరి 16న జరగనున్న విధాన పరిషత్ ఉపఎన్నికల కారణంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.












Click it and Unblock the Notifications