అడవిలో అలజడి ... దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్.. మావోల టార్గెట్ గా పది వ్యూహాలు
అడవిలో అలజడి కొనసాగుతోంది. ఆపరేషన్ దండకారణ్య కు రంగం సిద్ధమైంది. మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్న సమాచారంతో పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతకు రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ కంచుకోట అయిన దండకారణ్యంపై కేంద్ర సాయుధ బలగాలతో దాడులకు సిద్ధం అయింది . ఐదు రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్న దండకారణ్యంలో కేంద్ర బలగాలతో పాటు, రాష్ట్ర బలగాలు మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి .

మావోల అణచివేతకు రంగంలోకి దిగిన కేంద్రం ... 5 రాష్ట్రాలు టార్గెట్
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో పది రకాల వ్యూహాలతో కేంద్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది.
నవంబర్ నుండి వచ్చే సంవత్సరం జూన్ వరకు పూర్తిస్థాయిలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో నక్సల్స్ లేకుండా చేయాలన్న ఎజెండాతో ఆపరేషన్ ప్రహార్ మొదలు పెట్టనుంది కేంద్రం. చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,ఒడిశా రాష్ట్రాలలో ఇప్పటివరకు మావోయిస్టుల ప్రభావం ఉంది. దండకారణ్యం ఈ ఇదు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల పై దృష్టి సారిస్తున్న కేంద్రం మావోయిస్టుల కంచుకోటను బద్దలు కొట్టే ప్లాన్లో ఉంది.

కొత్త రాష్ట్రాలలోకి విస్తరించే ప్లాన్ లో మావోయిస్టులు
మరోవైపు మావోయిస్టులు కూడా మరో రెండు రాష్ట్రాల్లోకి తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ఆపరేషన్ ప్రహార్ మొదలుపెడితే కొత్తగా ఇంకో రెండు రాష్ట్రాలకు విస్తరించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. మావోయిస్టులు బెంగాల్, బీహార్ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మావోల అణచివేతకు ఈ నెల 15వ తేదీన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ ను కేంద్రం నిర్వహించింది.

మావోలకు బయట సంబంధాలను కట్ చేసి దాడులకు స్కెచ్
ఈ సమావేశంలో దండకారణ్యంలో ఏ విధంగా మావోయిస్టు స్థావరాలపై అటాక్ చేయాలి అన్న ప్లాన్స్ పై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
మావోయిస్టులకు బయట గ్రామాలలో ఉండి సహకరిస్తున్న సానుభూతిపరులను టార్గెట్ చేయడంతో పాటుగా, మావోయిస్టు స్థావరాలకు వారికి కావలసిన నిత్యావసరాలు అందకుండా చేయడం, ఏకకాలంలో మావోయిస్టుల ఏరివేతతో పాటు, మావోయిస్టు సానుభూతిపరుల భావజాల ప్రచారాన్ని ఎదుర్కోవడం చేయనున్నారు .
Recommended Video

వీరప్పన్ ను మట్టుబెట్టిన అధికారి చేతికి బాధ్యతలు .. ఏం జరుగుతుందో ?
ఈ ఆపరేషన్ బాధ్యతను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టిన తమిళనాడు పోలీస్ అధికారి విజయ్ కుమార్ కు అప్పగించినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులు, కేంద్ర రాష్ట్ర బలగాలకు జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో మావోయిస్టులు ఉనికి కోల్పోతారా ? పోలీసులు పట్టు సాధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దండకారణ్యంలో మొదలైన తాజా అలజడితో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications