Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్ ప్రారంభోత్సవం బహిష్కరణ-విపక్షాల్ని మళ్లీ ఏకం చేసిన కేంద్రం..

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ఈ నెల28న ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అయితే ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటు కొత్త భవనాన్ని స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, రాష్ట్రపతి వంటి వారు చేయాల్సి ఉండగా.. కార్యనిర్వాహక వ్యవస్ధకు అధిపతి అయిన ప్రధాని మోడీ ఎలా చేస్తారని విపక్షాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.

భారత కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం చైనా కౌన్సిల్ భవనాన్ని ప్రారంభించడాన్ని పోలి ఉంటుందని చెబుతున్న విపక్షాలు .. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాల ప్రాతినిధ్యం లేదని ప్రకటించాయి. ఈ మేరకు అనేక పార్టీలు వచ్చే ఆదివారం జరిగే వేడుకకు హాజరు కావడం లేదని ప్రకటించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, డీఎంకే, తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని వెల్లడించాయి.

opposition united over boycott of new parliament building opening

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా, జాతిపిత మహాత్మా గాంధీకి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి సందర్భంగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రణాళికలను ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ఈ అంశంపై ఇప్పటికే తమ అభ్యంతరాలు తెలియజేసినా కేంద్రం స్పందించకపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. అన్ని పార్టీల్ని కలుపుకుని చేయాల్సిన వేడుకను కేవలం బీజేపీ కార్యక్రమంలా నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే దేశంలో కేంద్రం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్ధలతో తమను టార్గెట్ చేస్తోందని విపక్షాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాయి. ఇప్పుడు పార్లమెంట్ భవనం ఏకపక్ష ప్రారంభోత్సవం వారిని మరోసారి ఏకం చేస్తోంది. అలాగే ఢిల్లీలో అధికారాలకు సంబంధించి కూడా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వారిని ఏకం చేస్తోంది. పార్లమెంటులో దీనిపై బిల్లు పెడితే వ్యతిరేకించేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా పలు విషయాల్లో విపక్షాలు ఏకమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+