వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీ, సుష్మా స్వరాజ్‌లపై విపక్షాలు చేతబడి చేయించాయి: ప్రగ్యా సాధ్వీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

జైట్లీ, సుష్మా స్వరాజ్‌లపై విపక్షాలు చేతబడి చేయించాయి || Oneindia Telugu

న్యూఢిల్లీ: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రధాన వార్తల్లో నిలిచే బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా మరోసారి వార్తల్లో నిలిచింది. బీజేపీ నేతలను అంతమొందించేందుకు విపక్షాలు దుష్టశక్తులను ప్రయోగిస్తున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ క్షుద్రపూజలు చేసే బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీల మృతికి కారణమయ్యారని కాంట్రవర్శీ స్టేట్‌మెంట్ చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సంతాప సభలో మాట్లాడిన సాధ్వీ ప్రగ్యా... ఓ సారి ఒక సాధువు తనతో చెప్పారని వెల్లడించింది. త్వరలోనే బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని... విపక్షాలు బీజేపీ వినాశనం కోరుతూ క్షుద్రపూజలు జరిపిస్తున్నాయని తనతో చెప్పినట్లు సాధ్వీ చెప్పారు. అయితే ఆ మాటలను తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పిన సాధ్వీ... ఒక్కో నాయకుడు మృతి చెందడం చూస్తే ఇది నిజమనిపిస్తోందన్నారు.

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ల మరణాలను ఉద్దేశించి సాధ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఏడాది గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, అనంతకుమార్, గతేడాది, అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి చెందారు. అంతా అనారోగ్యకారణంతోనే కన్నుమూశారు. ఇక మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా అనారోగ్యంతో కొన్నిరోజుల పాటు బాధపడి ఆ తర్వాత మృతి చెందారు. ఇక సుష్మా స్వరాజ్ కూడా గుండెపోటుతో ఆగష్టు 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇక గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా కేన్సర్‌తో పోరాడి కన్నుమూశారు.

Oppositions used evil powers to harm BJP leaders: Pragya Sadhvi

భోపాల్ నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ప్రగ్యా సాధ్వీ గతంలో కూడా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్నిసార్లు ఆమె చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అన్న కామెంట్స్ చేయడంతో బీజేపీ అధినాయకత్వం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. ఇక ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన హేమంత్ కర్కరే తన శాపంతోనే మృతి చెందాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.

English summary
After the deaths of former Union ministers Arun Jaitley and Sushma Swaraj within a span of few weeks, Sadhvi Pragya has blamed it on the Opposition for using a "marak shakti" against the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X