Prakash Raj: ఆస్కార్ అవార్డుల వేళ కొత్త కాంట్రవర్శీ.. ఆ వీడియో పోస్టు చేసిన ప్రకాష్ రాజ్
తన పాత వీడియోను తిరిగి పోస్టు చేస్తూ కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై తాను నాడు చెప్పిందే నిజమైందంటూ నటుడు ప్రకాష్ రాజ్ సరికొత్త వివాదానికి తెరలేపారు
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై రెండు ఆస్కార్ అవార్డులు నెగ్గి భారత పతాకం రెపరెపలాడుతున్న వేళ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి తెరతీశారు. గత ఫిబ్రవరి నెలలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్, ఆ వీడియోను తిరిగి పోస్టు చేస్తూ నేను అప్పుడు చెప్పిందే కరెక్ట్ అయ్యిందంటూ కొత్త పోస్టు చేశారు. దీంతో మళ్లీ అగ్గి రాజేసినట్లయ్యింది.
కశ్మీర్ పండిట్ల వలసల నేపథ్యంలో దర్శకులు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదల అయినప్పటి నుంచి దాని చుట్టూ వివాదాలే నెలకొన్నాయి. ఇటు రాజకీయంగాను అటు మతపరంగాను ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలోనే గత నెలలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టిందనే విషయం కాస్త ఘాటుగా చెప్పారు. వివాదం అంత సద్దుమణిగిందనుకున్న సమయంలో ఈ మధ్యనే గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇజ్రాయిల్ దర్శకుడు నాడవ్ లిపిడ్ చిత్రంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. దీంతో వివాదం మళ్లీ రాజుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కడంతో ఆ చిత్ర బృందాన్ని అభినందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ట్విటర్‌లో పోస్టు చేశారు. అయితే ఫిబ్రవరి నెలలో తాను ఓ కార్యక్రమంలో పాల్గొని ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన కామెంట్స్ వీడియోను పోస్టు చేశాడు. అంతేకాదు #Oscars 2023 హ్యాష్ ట్యాగ్ ఇస్తూ #PropagandaFiles పై నేనే చేసిన వ్యాఖ్యలు సరైనవే అంటూ సమర్థించుకున్నారు.
#Oscars2023… I was right on #PropogandaFiles … ಮತಾಂಧರ ಬೇಳೆಕಾಳು ಬೇಯಲ್ಲ .. ಅಷ್ಟೇ 😂😂😂#justasking pic.twitter.com/WeegAp5Vbz
— Prakash Raj (@prakashraaj) March 13, 2023
" కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక పనికమాలిన చిత్రం.ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించారో అందరికీ తెలుసు. సిగ్గుపడాలి. అంతర్జాతీయ జ్యూరీ ఆ ఫిలింమేకర్స్ పై ఉమ్మేసింది. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రి తన చిత్రానికి ఆస్కార్ ఎందుకు రాలేదని బాధపడుతున్నాడు. తాను తీసిన ఈ వివాదాస్పదమైన చిత్రానికి ఆస్కార్ కాదు కదా... భాస్కర్ కూడా రాదు. నాకున్న సమాచారం మేరకు కేవలం రెచ్చగొట్టే సినిమాలు చేసేందుకే రూ.2వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రతీసారి ఇలాంటి సినిమాలను తీసి ప్రజలను మభ్యపెట్టలేరు" అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

దీనిపై స్పందించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అదే సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చాడు.చిన్న చిత్రమైన ది కశ్మీర్ ఫైల్స్ కొందరు అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. ఎంతలా అంటే చిత్రం రిలీజై ఏడాది కావొస్తున్నప్పటికీ వారు ఇంకా భయపడుతూనే ఉన్నారని అన్నారు. ప్రకాష్ రాజ్‌ను అంధకార్ రాజ్ అని సంబోధించిన వివేక్ అగ్నిహోత్రి... భాస్కర్ అవార్డు తనకెందుకు వస్తుందని .. అలాంటి అవార్డులు ఎప్పటికీ ప్రకాష్ రాజ్ సొంతమని చెప్పుకొచ్చారు.

మొత్తానికి సమిసిపోయిందనుకున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర వివాదం ప్రకాష్ రాజ్ ట్వీట్-అగ్నిహోత్రి కౌంటర్‌తో మళ్లీ రాజుకుంది. అయితే దీనికి ముగింపు ఎలా పడుతుందో వేచిచూడాలి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications