వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

parliament monsoon session day 16: వెంకయ్యకు ఘన వీడ్కోలు-ఇరుసభల్లో కీలక బిల్లులు

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు వర్షాకాల సమావేశాల 16వ రోజైన ఇవాళ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. మరోవైపు లోక్‌సభ ఇంధన పరిరక్షణ (సవరణ) బిల్లు 2022ను ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనలు, డివిజన్ ఆఫ్ ఓట్ డిమాండ్ల మధ్య లోక్ సభలో విద్యుత్ (సవరణ బిల్లు) 2022ను ప్రవేశపెట్టడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Recommended Video

విరామం కేవలం రాజకీయాల నుండి మాత్రమే*Politics | Telugu OneIndia

న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సవరణ) బిల్లు, 2022ని కూడా లోక్‌సభ చర్చ, పరిశీలన, ఆమోదం కోసం స్వీకరించింది.కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు 2022ను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి రాజ్యసభ చేపట్టింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది.

సెంట్రల్ యూనివర్శిటీల (సవరణ) బిల్లు 2022ను రాజ్యసభ ఇవాళ ఆమోదించింది. అలాగే విద్యుత్ ఆదా బిల్లును లోక్ సభ ఆమోదించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు 2022ను కూడా రాజ్యసభ ఆమోదించింది.రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు ఎంపీలు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

parliament monsoon session day 16: grand farewell to vp venkaiah, key bills in both houses

ఈ సందర్భంగా ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన వెంకయ్యనాయుడు ప్రజాస్వామ్య ఆదర్శాలను నిలబెట్టడం ఎగువ సభ బాధ్యత అని అన్నారు. రాజ్యసభ ఎంపీలు మర్యాద, గౌరవం కాపాడుకోవాలన్నారు. తద్వారా సభ యొక్క ప్రతిష్ట, గౌరవం పెరుగుతుందన్నారు.

అటు లోక్ సభలో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండా ఉద్యోగుల జిపిఏఫ్ ఖాతాల నుండి 2021, 2022 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీపీఎఫ్ సొమ్ము రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సమ్మతితోనే విత్ డ్రా చేసిందా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.. 2021, 2022 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి 68020 జిపిఏఫ్ ఖాతాలలో అంతకు మునుపు జమ చేసిన డీఏ మొత్తం నుంచి రూ. 413.73 కోట్లు డీఏ బకాయిలు విత్ డ్రా చేశారని సమాధానం ఇచ్చారు.

English summary
day 16th of the parliament mansoon session, rajya sabha to give grand farewell to outgoing vice president venkaiah naidu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X