Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'రెచ్చగొట్టింది తమిళులే.. కన్నడిగులపై ఎటాక్ చేశారు' : సదానంద గౌడ

న్యూఢిల్లీ : కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి జల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరులో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలు ఒక్కసారిగా అన్ని రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేశాయి. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ.. తమిళుల రెచ్చగొట్టుడు ధోరణి వల్లే వివాదం ఇంతగా ముదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన సదానంద గౌడ.. కన్నడిగులపై, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేయడం మూలంగానే వివాదం రాజుకుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ సమన్వయం పాటించాలని సూచించారాయన. హింసతో సమస్యలు పరిష్కారం కావని సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

 Sadananda Gowda

కర్ణాటక రాష్ట్రానికి నీళ్లు లేవన్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్బంగా సదానందగౌడ చెప్పారు. కర్ణాటకలో వర్ణాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే.. కావేరి నీళ్లను కర్ణాటక తమిళనాడుకు విడుదల చేయలేదన్నారు. ఈ ఏడాది 40శాతం తక్కవ వర్షాపాతం నమోదవడంతో.. కేవలం రెండు మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత ఉన్న పరిస్థితి నెలకొందన్నారు.

మునుపెన్నడూ ఇలాంటి తరహా పరిస్థితులు లేవన్న సదానంద గౌడ.. ట్రిబ్యునల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+