వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని రాష్ట్రాలకు అగ్నిపథ్ నిరసనలు-సిట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్టాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ నిరసనలు మరికొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. దీంతో కేంద్రం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలోనే నిరసనలపై సిట్ దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ విటిషన్ దాఖలైంది.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతుండగా.. గత గంటల్లో అవి కాస్తా కేరళ, హరియాణా వంటి రాష్టాలకు కూడా పాకాయి. దీంతో నిరసనల్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆందోళనకారులు ముఖ్యంగా రైల్వేస్టేషన్లను టార్గెట్ చేయడంతో భారీ ఎత్తున రైల్వే ఆస్తులకు నష్టం జరుగుతోంది. దీంతో అగ్నిపథ్ ఆందోళనల్ని అడ్డుకునే విషయంలో కేంద్రానికీ ఇబ్బందులు తప్పడం లేదు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణ పడ్డారు, రైళ్లు, రైల్వే స్టేషన్‌లను తగులబెట్టడం లేదా ధ్వంసం చేయడం, రైల్వే ట్రాక్‌లు, హైవేలను దిగ్బంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని ఒక పోలీసు స్టేషన్‌ను కూడా తగులబెట్టారు. బీహార్‌లోని ఉప ముఖ్యమంత్రి రేణు దేవితో సహా సీనియర్ బిజెపి వ్యక్తుల ఇళ్లపై దాడి చేశారు.

petition in supreme court seeking sit inquiry on agnipath as protests spread more states

యూపీలో పోలీసులు ఒక ప్రధాన రహదారిపై నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు మరియు ప్రభుత్వ బస్సులపై దాడి చేశారు. హర్యానాలో కూడా నిరసనలు చెలరేగాయి. దీంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. రాజస్థాన్, ఒడిషా, మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్దితి. బెంగాల్లో నిరసనల కారణంగా వందలాది రైళ్లు తమ గమ్యస్థానానికి చేరుకోకముందే రద్దు అవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

వరుస నిరసనలు, ఆస్తుల ధ్వంసం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అగ్నిపథ్ పథకంలో కొన్ని మార్పులు ప్రకటించింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికై శిక్షణ పొందిన అగ్నివీరులకు భవిష్యత్తులో కేంద్ర బలగాలు, అస్సాం రైఫిల్స్ లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వయో పరిమితిపై కూడా సానుకూలంగా స్పందిస్తోంది.

అయినా ఘర్షణలు ఆగడం లేదు. దీంతో కేంద్రం ఇరునపడుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఆస్తుల ధ్వంసంపై సిట్ విచారణ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

English summary
protests against central govt's agnipath scheme has been spreaded to more states today and a petition filed in supreme court seeking sit inuqiry on this scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X