హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ ట్రాజెడీ: పాండో వద్ద జోగు రామన్న (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

మండి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థుల్లో మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 17 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. ఈ నెల 8న నగర శివారుల్లోని బాచుపల్లికి చెందిన విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు స్టడీ టూర్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని బియాన్‌ నదికి చేరుకున్న సంగతి తెలిసిందే.

అక్కడ ప్రమాదవశాత్తూ డార్జీ డ్యాం నుంచి అక్కడి అధికారులు నీటి ని వదలడంతో ఫోటోల కోసం నదిలోకి దిగిన విద్యార్థులు ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృ తికి 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి అధికారులతో పాటు హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డిని అక్కడికి పంపించింది.

నాయని నర్సింహా రెడ్డి కొన్నాళ్లు సహాయక చర్యలు పర్యవేక్షించిన తర్వాత ఆయన స్థానంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెళ్లారు. మహేందర్ రెడ్డి హైదరాబాదు తిరిగి రాగా మరో తెలంగాణ మంత్రి జోగు రామన్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద జోగు రామన్న

24 మంది విద్యార్థులు గల్లంతైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వద్ద సహాయక చర్యలను తెలంగాణ మంత్రి జోగు రామన్న సోమవారం పర్యవేక్షించారు.

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద జోగు రామన్న

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాద స్థలిలో సహాయక చర్యలను పర్వవేక్షిస్తూ తెలంగాణ మంత్రి జోగు రామన్న ఇలా...

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్వవేక్షిస్తూ తెలంగాణ మంత్రి జోగు రామన్న ఇలా కనిపించారు.

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద జోగు రామన్న

రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సహాయక చర్యల పర్యవేక్షణకు మంత్రి జోగు రామన్న బియాస్ నది వద్దకు వచ్చారు.

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నది వద్ద జోగు రామన్న

బియాస్ నదిలో గల్లంతైనవారిలో మరో ఏడుగురు విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వాటిని జోగు రామన్న పర్యవేక్షిస్తున్నారు.

English summary
Telangana minster Jogu Ramanna is supervising relief measures at Beas river in Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X