దేశంలో అవినీతికి యూపీఏనే కారణం-ప్రధాని మోడీ పాత పాట-సీబీఐ, సీవీసీకి దిశా నిర్దేశం
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అవినీతిపై చర్చ సాగుతున్న వేళ.. ప్రధాని మోడీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు విభాగాలైన సీబీఐ, సీవీసీలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. పనిలో పనిగా గతంలో యూపీఏ సర్కార్ హయాం వల్లే అవినీతి పెరుగుతోందంటూ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
అవినీతి నిర్మూనలపై సీవీసీ, సీబీఐ అధికారులతో వర్చువల్ గా సమావేశమైన ప్రధాని మోడీ.. తాజా పరిస్ధితిపై చర్చించారు. తమ ప్రభుత్వం గత ఆరు-ఏడు సంవత్సరాలలో కష్టపడి పనిచేసిన తరువాత, అవినీతిపై పోరాడటం సాధ్యమవుతుందని మరియు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతామని ప్రజలలో విశ్వాసం ఏర్పడిందని ప్రధాని తెలిపారు.

గుజరాత్‌లోని కెవాడియాలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ, గత ప్రభుత్వానికి (యూపీఏకి )అవినీతిపై పోరాడే ఉద్దేశం లేదని మోదీ పేర్కొన్నారు. ఆరేడేళ్లుగా దేశంలో అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పగలిగినట్లు ప్రధాని తెలిపారు. ఎలాంటి దళారులు లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలమనే నమ్మకం ఇవాళ దేశ ప్రజలకు ఉందని్ ప్రధాని పేర్కొన్నారు. అవినీతి, పెద్ద లేదా చిన్న, సాధారణ ప్రజల హక్కులను హరిస్తుందని మోడీ తెలిపారు. ఇది దేశ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని, మన సమిష్టి శక్తిని ప్రభావితం చేస్తుందని ప్రధాని వెల్లడించారు.
దేశానికి, ప్రజలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడే వారికి ప్రపంచంలో ఎక్కడా సురక్షితమైన స్వర్గధామం ఉండకూడదని తాము భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే దేశంలో బ్యాంకులను ముంచి విదేశాల్లో సుఖంగా తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి అవినీతిపరుల గురించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications