Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో మోడీ హిందీలో మాట్లాడుతుంటే... బేర్ గ్రిల్స్ ఎలా అర్థం చేసుకున్నాడు..?

ఈ నెల పన్నేండున డిస్కవరి చానల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సాహసికుడు బియర్ గ్రిల్స్‌కు తో కలిసి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో పలు అంశాలపై చర్చించారు. దీంతోపాటు పర్యవరణం పై ఉన్న తనకు ఉన్న అభిప్రాయాలను వివరించారు. కాగ ఇద్దరు కలిసి చేసిన కార్యక్రమంలో టెలివిజన్ చరిత్రలో రికార్డు కూడ సృష్టించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్ రికార్డ్ స్ధాయిలో ప్రజలు వీక్షించారు.

PM Modi has revealed how he talked to British national Bear Grylls in Hindi,

అయితే ఈ కార్యక్రమం అంద్యాంతం హిందీ బాషలోనే కొనసాగింది. హిందీ బాషలో ప్రధాని మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అయితే హిందీ రాని బేర్ గ్రిల్స్ ప్రధాని మాట్లాడే అంశాలను అర్థం చేసుకున్నాడు. ఇది ఎలా సాధ్యమయిందనేది వీక్షకులకు అనుమానాలు ఉండేవి, అసలు హిందీ బాష రాని వ్యక్తితో పూర్తి తన అభిప్రాయాలను హిందీలో పంచుకున్న మోడీ స్వయంగా తానే ఆ సీక్రెట్‌ను బయటపెట్టారు. నేడు మన్‌కీబాత్‌ కార్యక్రమంలో బాగంగానే ఆయన ఈ విషయాలను ప్రజలతో పంచుకున్నారు.

ఇదంతా సాంకేతిక సహాయంతోనే సాధ్యమయిందని చెప్పారు. ప్రస్థుతం టెక్నాలజీ సహాయంతోనే ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగాయని చెప్పారు. జీమ్ కార్బెన్ నేషనల్ పార్క్‌లో కార్యక్రమం కొనసాగుతున్నప్పుడు బేర్ గ్రిల్స్ తన చెవికి కార్డ్‌లెస్ పరికరాన్ని పెట్టుకున్నారని , తాను హిందీలో మాట్లాడిన మాటలు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్ అయ్యాయని,దీంతో బేర్ గ్రిల్స్ అర్థం చేసుకున్నారని చెప్పారు. దీంతో బాషకు సంబంధించి ఎలాంటీ అంతరాయం లేకుండా కార్యక్రమం కొనసాగిందని ,ఇదే దీనికి వెనక ఉన్న రహస్యమని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+