అయోధ్యలో ఒకే రోజు 15,700 కోట్ల పనులకు మోడీ శ్రీకారం-ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్, రైళ్ల ప్రారంభం..

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభఘడియలు దగ్గరపడుతున్న వేళ ప్రధాని మోడీ ఇవాళ నగరంలో రికార్డు స్దాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.15700 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేశారు. దీంతో పాటు ఇప్పటికే సిద్ధమైన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునీకీకరించిన అయోధ్య థామ్ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. రూ.240 కోట్లకు పైగా వ్యయంతో ఆధునీకీకరించిన ఈ మూడు అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ స్టేషన్ భవనం అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇది ఐజీబీసీ సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ భవనమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఈ స్టేషన్ నుంచే ప్రధాని మోడీ ఆరు వందే భారత్ రైళ్లకు, రెండు అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఏసీ కోచ్‌లు ఉండవు. మెరుగైన పికప్ కోసం ఈ రైలు రెండు చివర్లలో ఇంజన్లు కలిగి ఉంటుంది. ప్రయాణీకులకు రీ-డిజైన్ చేయబడిన సీట్లు, మెరుగైన లగేజీ రాక్‌లు, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, ఎల్ఈడీ లైట్లు, సీసీటీవీ , పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలతో దీన్ని రూపొందించారు.

ఇవాళ ప్రారంభించిన రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు దర్భంగా నుండి అయోధ్య మీదుగా ఆనంద్ విహార్, మాల్దా టౌన్ నుండి బెంగళూరు వరకు నడుస్తాయి. ఈ రైళ్ల ప్రారంభోత్సవం అమృత్ భారత్ రైలులోకి ఎక్కి విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. అయోధ్య రామమందిర నిర్మాణ తర్వాత ఈ స్టేషన్ కు మొత్తం 15 కొత్త రైళ్లు రాకపోకలు సాగించేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే ప్రధాని మోడీ అయోధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు.

అనంతరం ప్రధాని మోడీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రూ.1450 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ విమానాశ్రయం ఫేజ్ 1 అభివృద్ధి చేశారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా 10 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో దీని ఫేజ్ 2 నిర్మాణం కూడా చేపడతారు. దీని తర్వాత ప్రధాని మోడీ అయోధ్యలో రూ.15700 కోట్ల వ్యయంతో చేపట్టే 46 ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+