వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టించుకోరా, నేను గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చెప్పరా!: ఎంపీలపై మోడీ అసహనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. నేను ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని సందేశం పెడుతున్నానని, ఎవరూ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.

చదవండి: షాకింగ్: రాజకీయాలపై రజనీకాంత్ ఆలస్యం, బీజేపీ ఒత్తిడి? 'అలా ఐతే అవసరమే లేదు'

సొంత పార్టీ నేతలు, ఎంపీలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడారు.

చదవండి: తమ్ముడి ఆస్తులు అన్నకు, ఆర్‌కాం ఆస్తులు జియో చేతికి: అనిల్ ఆస్తులు వేరేవాళ్లకు వెళ్లకుండా

మిగతా వారు పట్టించుకోవట్లేదు

మిగతా వారు పట్టించుకోవట్లేదు

రోజూ ఉదయాన్నే మోడీ 'నరేంద్రమోడీ' యాప్‌ నుంచి బీజేపీ నేతలకు గుడ్ మార్నింగ్‌ సందేశం పంపిస్తారు. అయితే కేవలం కొద్దిమంది ఎంపీలు మాత్రమే తన సందేశానికి స్పందిస్తున్నారని, మిగతా వారెవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐదారుగురు మాత్రమే స్పందిస్తున్నారు

ఐదారుగురు మాత్రమే స్పందిస్తున్నారు

'ప్రతీరోజు ఉదయాన్నే నేను సందేశం పంపిస్తాను, కానీ ఐదారుగురు ఎంపీలు మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా ఎవరూ స్పందించడం లేదు. శుభోదయం శుభాకాంక్షలతో పాటు ప్రముఖ సందేశాన్ని కూడా పంపిస్తాను. దానిని పట్టించుకోవడం లేదు.' అని మోడీ అన్నారు.

మోడీ యాప్ గురించి వివరించిన కేంద్రమంత్రి

మోడీ యాప్ గురించి వివరించిన కేంద్రమంత్రి

నరేంద్ర మోడీ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతూ ఉండాలని నేతలకు సూచించారు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ యాప్‌ ద్వారా ప్రధాని ప్రచారాన్ని చేపట్టారు. మహిళా కార్యకర్తలతో వీడియో చాటింగ్‌ ద్వారా మాట్లాడారు. మోడీ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే దాని గురించి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు.

ఇదే మొదటిసారి కాదు, పోటీపై ఆగస్టులో హెచ్చరిక

ఇదే మొదటిసారి కాదు, పోటీపై ఆగస్టులో హెచ్చరిక

బీజేపీ ఎంపీల తీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది తొలిసారి కాదు. ఆగస్టు నెలలోను పార్లమెంటు సమావేశాలకు సరిగా రానిపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు సరిగా రాకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారని వ్యాఖ్యానించారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై

ట్రిపుల్ తలాక్ బిల్లుపై

ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతూ.. పురుషులు, స్త్రీలు అని తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించడం కోసమే ఈ బిల్లు అని చెప్పారు. దీనిని అందరి కలిసి ఆమోదించాలని చెప్పారు. కాగా ఆ తర్వాత లోకసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మూజువాణి ఓటుతో పాస్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi, on Thursday at the BJP parliamentary meeting, admonished party MPs for "ignoring" his text messages and asked them to start following the Narendra Modi app regularly, said a media report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X