పాకిస్తాన్ ఐఎస్ఐకు పోఖ్రాన్ అణుపరీక్షా కేంద్ర కీలక సమాచారం .. ఆర్మీ బేస్ కూరగాయల సరఫరాదారు అరెస్ట్ !!
భారత్, పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల అలజడి, డ్రోన్ల కలకలం నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా భారత న్యూక్లియర్ పరీక్షా కేంద్రానికి సంబంధించిన కీలకమైన, సున్నితమైన సమాచారం పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేసిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ బృందం అరెస్ట్ చేసింది.

ఆర్మీ బేస్ సమాచారం ఐఎస్ఐ కు అందించిన కూరగాయల సరఫరాదారు
పోఖ్రాన్ ఆర్మీ బేస్ క్యాంపుకు కూరగాయలను సరఫరా చేసే హబీబ్ ఖాన్ అనే రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాకు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్ట్ చేసింది. పోఖ్రాన్ ఆర్మీ బేస్ క్యాంప్ వద్ద కూరగాయలను సరఫరా చేసే ఒక కూరగాయల సరఫరాదారు, ఆర్మీలో పనిచేసే వ్యక్తికి డబ్బు ఆశ చూపి,అతని ద్వారా పోఖ్రాన్ బేస్ క్యాంప్ కి సంబంధించిన కొన్ని సున్నితమైన రహస్య పత్రాలను తీసుకొని పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్) కు ఇచ్చాడని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ను అతనిని అరెస్టు చేసింది.

ఇంటిలిజెన్స్ వివరాలతో పాకిస్తానీ ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్
34 ఏళ్ల కూరగాయల సరఫరాదారు, హబీబ్ ఖాన్ రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాకు చెందినవాడు . ఇతను గత కొన్నేళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పోఖ్రాన్ ఆర్మీ బేస్ క్యాంప్‌కు కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించిన వివరాల మేరకు, ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం మంగళవారం పోఖ్రాన్ నుండి నిందితుడిని పట్టుకున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పట్టుబడిన నిందితుడు బేస్ క్యాంప్ వద్ద పోస్ట్ చేసిన ఆర్మీ అధికారికి డబ్బులు ఇస్తూ తనకు కావాల్సిన సమాచారం సేకరించాడని తెలుస్తుంది.

ఆర్మీ బేస్ లో పని చేసే వ్యక్తికి డబ్బులిచ్చి రహస్య సమాచారం సేకరణ
ఆర్మీ బేస్ లో పని చేసే వ్యక్తి వద్ద నుండి రహస్య సమాచారం సేకరించి దానిని పాకిస్తాన్ యొక్క ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కు అందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆర్మీ అధికారి కూరగాయల సరఫరాదారుకు తాను అందించిన ప్రతి పత్రానికి డబ్బు తీసుకునేవారని తెలుస్తుంది. అయితే, ఈ విషయం దర్యాప్తులో ఉందని, వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయి అని పోలీసులు చెప్తున్నారు. కూరగాయల సరఫరాదారును అరెస్ట్ చేసిన పోలీసులు, అతనికి పోఖ్రాన్ బేస్ కు సంబంధించిన రహస్య పత్రాలు అందించిన అధికారి ఎవరు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు .

పోఖ్రాన్ సున్నితమైన అను పరీక్షా కేంద్రం .. రహస్య సమాచారం చేరవేతతో అలెర్ట్
పోఖ్రాన్ భారతదేశం యొక్క అణు పరీక్షా ప్రదేశం, చాలా సున్నితమైన స్థావరం. ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్ ఐఎస్ఐ కు అందించడం ఇప్పుడు భారత భద్రతా దళాలకు పెద్ద సవాల్ గా మారింది.దేశంలో ఒకపక్క పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు, మరోపక్క జరుగుతున్న ఇలాంటి గూఢ చార ఆపరేషన్లు వెరసి భారత భద్రతా వ్యవస్థ ఆందోళనలో పడింది. ఎక్కడికక్కడ ఇంటలిజెన్స్ బృందాలు అలెర్ట్ చెయ్యటంతో ఉగ్రమూక కుట్రలకు, గూఢచార వ్యవస్థలకు అడ్డుకట్ట వెయ్యగలుగుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications