• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలిస్తే రాజకీయ వ్యూహకర్తగా పని చెయ్యటం మానేస్తా .. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర

|

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ ను గద్దె దింపాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రచార పర్వం నిర్వహిస్తున్న ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, సవాళ్లు, ప్రతిసవాళ్లకు తెరలేపుతున్నారు.

  Farmer unions ask people to vote against BJP | Oneindia Telugu
  బెంగాల్ లో మమతకే పట్టం .. బిజెపి 100కి పైగా సీట్లు గెలిచే సీన్ లేదన్న పీకే

  బెంగాల్ లో మమతకే పట్టం .. బిజెపి 100కి పైగా సీట్లు గెలిచే సీన్ లేదన్న పీకే

  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోసం పని చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వస్తారని తన వాదనను మరోసారి పునరుద్ఘాటించారు. బెంగాల్‌లో బిజెపి అధికారంలోకి వస్తే తాను చేస్తున్న పనిని మానేస్తానని ఆయన తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బెంగాల్‌లో బిజెపి 100కి పైగా సీట్లు గెలిస్తే, నేను ఈ ఉద్యోగాన్ని వదిలివేస్తాను, ఐ ప్యాక్ ని కూడా వదిలివేస్తాను. నేను వేరే పని ఏదైనా చేసుకుంటూ బ్రతుకుతాను అంటూ చాలెంజ్ చేశారు.

  బిజెపి గెలిస్తే ఏ ఇతర రాజకీయ ప్రచారాలలో, పార్టీల కోసం పని చెయ్యను

  బిజెపి గెలిస్తే ఏ ఇతర రాజకీయ ప్రచారాలలో, పార్టీల కోసం పని చెయ్యను

  ఒకవేళ పశ్చిమబెంగాల్లో ఎన్నికలలో బిజెపి గెలిస్తే మరి ఏ ఇతర రాజకీయ ప్రచారాలలో , రాజకీయ పార్టీల కోసం పని చేయడంలో తనను చూడలేరని ఆయన పేర్కొన్నారు.

  ఎన్నికల వ్యూహకర్తగా ఉత్తర ప్రదేశ్‌ను కోల్పోయామని కాని అక్కడ తాము కోరుకున్నది చేయలేకపోయామని ఆయన స్పష్టం చేశారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో ఆ అవసరం లేదన్నారు. దీదీ తనకు కావలసినంత పని చేయడానికి స్వేచ్ఛ నిచ్చారని పేర్కొన్నారు. బెంగాల్ లో పరాజయం పాలైతే తాను ఎన్నికల వ్యూహకర్తగా, ఈ ఉద్యోగానికి సరిపోనని అంగీకరిస్తాను అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

   టీఎంసీలో ఉన్న అంతర్గత వైరుధ్యాలతో లాభం పొందాలని చూస్తున్న బీజేపీ

  టీఎంసీలో ఉన్న అంతర్గత వైరుధ్యాలతో లాభం పొందాలని చూస్తున్న బీజేపీ

  ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత వైరుధ్యాలను ఉపయోగించుకోవడంలో బిజెపి కీలకంగా పనిచేస్తుందని, అంతకుమించి బీజేపీకి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. 2021 బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టిఎంసి నాయకుల గురించి మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ టీఎంసీ నేతలను బిజెపిలో చేర్చుకోవడం వారి వ్యూహంలో భాగం అన్నారు . తన వల్లే టి ఎం సి నాయకులు పార్టీని వీడి వెళ్లారన్న దానిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్ తాను పార్టీని గెలిపించడానికి మాత్రమే పని చేస్తున్నానని, స్నేహితులను సంపాదించుకోవడానికి మాత్రం కాదని స్పష్టం చేశారు.

   పార్టీ గెలుపు కోసం పని చేస్తున్న క్రమంలో కొంతమందికి నచ్చకపోవచ్చు అని పీకే పేర్కొన్నారు.

  పార్టీ గెలుపు కోసం పని చేస్తున్న క్రమంలో కొంతమందికి నచ్చకపోవచ్చు అని పీకే పేర్కొన్నారు.

  మమతా బెనర్జీ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ప్రజలు తిరిగి మమతా బెనర్జీ కే పట్టం కడతారని, ఆమె పైన వారికి పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు . బెంగాల్‌లో 200 సీట్లు గెలుచుకుంటామని బిజెపి, అమిత్ షా పేర్కొన్నారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ వర్గాలలో భయాందోళనలు సృష్టించడానికే అని పేర్కొన్న ప్రశాంత్ కిషోర్ అది బీజేపీ వల్ల కాదన్నారు.

  బీజేపీ సమావేశాలకు ఆదరణ కరువు అన్న ప్రశాంత్ కిషోర్

  బీజేపీ సమావేశాలకు ఆదరణ కరువు అన్న ప్రశాంత్ కిషోర్

  బెంగాల్ ఎన్నికలలో బిజెపి చెప్పింది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన సమావేశాలకు కూడా 200, 300 మించి జనాలు రావటం లేదని, పెద్దగా స్పందన లేదని తెలిపిన ప్రశాంత్ కిషోర్ కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలకు మాత్రమే భారీగా స్పందన వస్తుందని పేర్కొన్నారు.

  బెంగాల్ రాష్ట్రం సొంత కూతుర్నే కోరుకుంటుందని ప్రశాంత్ కిషోర్ ,ఆరోమారు స్పష్టం చేశారు.

  English summary
  Political strategist Prashant Kishor has once again reiterated his claim that the ruling Trinamool Congress and CM Mamata Banerjee will come back to power, and told that if BJP comes to power in Bengal, he will quit the job as political startegist.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X