దీపావళి బాంబు పేల్చిన కేంద్రం: గ్యాస్ సిలిండర్ల రేట్లు భారీగా పెంపు

Commercial LPG Cylinder Price: దేశం మొత్తం దీపావళి పండగ కోలాహలం నెలకొంది. ప్రజలు ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోన్నారు. అన్ని రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసారంభం నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య వంటగ్యాస్ వినియోగదారులపై పెనుభారం పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై అదనంగా 62 రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.

Prices of commercial LPG gas cylinders has been increased by Rs 62 with effect from today

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,802 రూపాయలకు పెరిగింది. నిన్నటి వరకు ఈ ధర 1,740 రూపాయలుగా ఉండేది. కోల్‌కతలో రూ.1,850.50 పైసల నుంచి 1.911.50 పైసలకు పెరిగింది.

ముంబైలో రూ.1,692.50 పైసల నుంచి 1,754.50 పైసలకు పెరిగింది. చెన్నైలో 1,903 నుంచి 1,964.50 పైసలకు చేరింది ఒక్కో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర. నాలుగు నెలల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి.

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వాటి రేట్లను పెంచాయి చమురు కంపెనీలు. ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసల మేర భారాన్ని వినియోగదారుల మీద మోపాయి. ఇప్పుడు మళ్లీ 62 రూపాయలు చొప్పున పెంచాయి.

గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+