ప్రధాని మోడీని సల్మాన్ ఖాన్ తో పోల్చిన ప్రియాంక..! ఘాటు పంచ్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈసీ 65 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర తాజాగా ముగిసింది. ఈ యాత్రకు భారీ స్పందన కూడా లభించింది. ఈ క్రమంలోనే ఓ ఆర్జేడీ నాయకుడు ప్రధాని మోడీ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రధాని మోడీ ఇవాళ చనిపోయిన తన తల్లిని ఉద్దేశించి తిడుతున్నారంటూ వాపోయారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బీహార్ లోనే స్పందించారు.

తన తల్లి తనను దేశ సేవ చేయడానికి పంపిందని, ప్రతి తల్లి తన కొడుకు తనకు సేవ చేయాలని కోరుకుంటుందని ప్రధాని మోడీ ఇవాళ తెలిపారు. కానీ తన తల్లి నన్ను మీలాంటి కోట్లాది మంది తల్లులకు సేవ చేయడానికి పంపిందన్నారు. తన తల్లి శరీరం ఇప్పుడు ఈ లోకంలో లేదని, ఆమె కొంతకాలం క్రితం మనల్ని విడిచిపెట్టిందన్నారు. నా తల్లిని ఆర్జేడీ - కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు.

Priyanka Gandhi Compares PM Modi s Emotional Speeches to Salman Khan s Crying Role in Tere Naam

తన తల్లిని తిట్టడం అంటే దేశంలోని ప్రతీ తల్లీ, చెల్లినీ దూషించడమే అన్నారు. తన తల్లిపై చేసిన దూషణకు తానేమీ చేయకపోయినా మహిళలే వారికి తగిన బుద్ధి చెప్తారంటూ మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వీటిపై స్పందించారు. మోడీకి ఎక్కడివెళ్లినా జనానికి తన కష్టాలు చెప్పుకోవడం అలవాటుగా మారిపోయిందని ప్రియాంక విమర్శించారు.

Priyanka Gandhi Compares PM Modi s Emotional Speeches to Salman Khan s Crying Role in Tere Naam

ప్రధాని మోడీ ఎలాంటి ప్రధానమంత్రి అంటే ఎప్పుడూ తన కష్టాల గురించే మాట్లాడుతుంటారని ప్రియాంక గాందీ ఎద్దేవా చేశారు. కర్నాటక వెళ్తే అక్కడ తన కష్టాల లిస్ట్ తీసుకెళ్లి చదువుతారని, బీహార్ వస్తే ఇక్కడా తన కష్టాల గురించే మాట్లాడతారని ప్రియాంక ఆక్షేపించారు. ఆయన తీరు ఎలా ఉందంటే సల్మాన్ ఖాన్ పాత చిత్రం తేరే నామ్ లో ఏడుపుగొట్టు పాత్రలా ఉందన్నారు. సినిమా ఆద్యంతం సల్మాన్ ఖాన్ తన గురించే ఏడుస్తుంటారని గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ మీద కూడా సినిమా తీసి దానికి మేరే నామ్ అని పేరు పెట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+