ఆశలు ఆవిరి.. పీఎస్‌ఎల్‌వీ - సి 61 గాల్లోకి ఎగిరిన కాసేపటికే !

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ రాకెట్‌ ప్రయోగం విఫలం అయ్యింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించింది. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటి తర్వాత సాంకేతి సమస్య తలెత్తింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం పూర్తికాలేదని.. మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్‌ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (రీశాట్‌-1బీ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈఓఎస్‌-09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు ఉండగా జీవితకాలం ఐదేళ్లు. జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుందని అంచనా వేశారు. భవిష్యత్తులో భారత్‌ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్టు పేర్కొన్నారు.

pslv-c61-rocket-launch-by-isro-failed-due-to-technical-issues

అంతే కాకుండా ఇందులో అమర్చిన సీ-బ్యాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్‌ కలిగిన చిత్రాలను సేకరించేందుకు సిద్దం చేశారు. ఇప్పటి దాకా వున్న ఈఓఎస్‌ ఉపగ్రహాల సిరీస్‌ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్‌ను అమర్చి పంపించేందుకు చూశారు.

ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్‌తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్నీ అందిస్తుందని భావించారు. ఈఓఎస్‌ ఉపగ్రహాల సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం కాగా సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం విఫలం కావడం ఆశయాలను ఆవిరి చేసిందని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+