వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైనమిక్ లీడర్లే కాని, అమర్ ను అంకుల్ అని పిలిచినా, అఖిలేష్ కు అప్పుడే షాక్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ను ప్రశంసించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల మద్య పొత్తును పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆసక్తికర పోస్టు పెట్టాడు. అఖిలేష్, రాహుల్ లను పొగడ్తలతో ముంచెత్తారు.మరో వైపు తండ్రి , కొడుకుల మద్య అంతరం లేదనే సంకేతాలను ఇచ్చారు యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్,ములాయం సింగ్ సోషలిస్టు అని చెప్పారు.మరో వైపు అమర్ సింగ్ ను అంకుల్ అంటూ ఓ టివి చానెల్ కార్యక్రమంలో పిలిచి అందరినీ విస్మయపర్చారు అఖిలేష్. ఇదిలా ఉంటే బిసి ఉప కులాలను ఎస్ టి లో చేర్చడంపై కోర్టు స్టే విధించింది.

వారిద్దరూ కలిశారు , మ్యానిఫెస్టోను విడుదల చేసిన ములాయం,శివపాల్ కు దారేదీ?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీపార్టీలు పొత్తు కుదుర్చుకొని పోటీచేస్తున్నాయి.అయితే ఈ పొత్తులో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు.

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు, ఐదుగురు సిట్టింగ్ లకు మొండిచేయి చూపిన అఖిలేష్

ప్రియాంకగాంధీ చొరవ కారణంగానే ఈ రెండుపార్టీల మద్య పొత్తు కుదిరింది.అఖిలేష్ తో ఆమె తెల్లవారుజాము వరకు చర్చల్లో పాల్గొని పొత్తు కుదిరేలా ఒప్పించారు.

అయితే ఈ పొత్తు పై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో ప్రియాంక పేరును ప్రస్తావించలేదు. ఈ పొత్తు వల్ల రెండుపార్టీలకు ప్రయోజనమని రాశారు.

 ప్రియాంక పేరు రాయకుండానే పోస్టు

ప్రియాంక పేరు రాయకుండానే పోస్టు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మద్య పొత్తును రాబర్ట్ వాద్రా ప్రశంసల్లో ముంచెత్తారు.ఈ పొత్తును బ్రిలియంట్ ఐడియా అంటూ ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు డైనమిక్ నాయకులు అంటూ కితాబు ఇచ్చారు.ఈ పొత్తులో కీలకభూమిక పోషించిన ప్రియాంక పేరును మాత్రం ఆయన ఈ పోస్టులో చేర్చలేదు. ఆమె పేరును ప్రస్తావించకుండానే ఈ పోస్టును పెట్టడం గమనార్హం.

ప్రియాంక పోటీచేస్తారా?

ప్రియాంక పోటీచేస్తారా?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుండి ప్రియాంక గాంధీ పోటీచేస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నుండి ప్రియాంక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అఖిలేష్, రాహుల్ డైనమిక్ లీడర్లు

అఖిలేష్, రాహుల్ డైనమిక్ లీడర్లు

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డైనమిక్ లీడర్లు అంటూ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసల్లో ముంచెత్తారు. సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీ ల పొత్తు ఉత్తర్ ప్రదేశ్ అభివృద్దికి దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ తో పొత్తు సమాజ్ వాదీ పార్టీకి కలిసివస్తోందా?

కాంగ్రెస్ తో పొత్తు సమాజ్ వాదీ పార్టీకి కలిసివస్తోందా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం కలిసి వస్తోందని ఆ పార్టీ నాయకులు అబిప్రాయపడుతున్నారు.పట్టణ ప్రాంత ఓటర్లు బిజెపి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటుచేశారు. గత ఎన్నికల ఫలితాల ఆదారంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ప్రయోజనమని ఎస్ పి భావించింది. పట్టణ ప్రాంతాల్లోని సుమారు వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.2014 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను సమాజ్ వాదీ పార్టీ పరిశీలించింది. అయితే ఈ ఎన్నికలు పూర్తైన 11 మాసాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసిన అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొన్నాడు.

ములాయం సింగ్ సోషలిస్టు

ములాయం సింగ్ సోషలిస్టు

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోషలిస్టు అంటూ ఆయన తనయుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఇంట్లో, బయట ఒకే విధంగా తన కోపాన్ని వ్యక్తం చేస్తారంటూ ఆయన ములాయం కు కితాబిచ్చారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన బావోద్వేగాలను ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇంట్లో, బయట కూడ ఒకే రకంగా వ్యవహరించారని చెప్పారు.ఆయన సోషలిస్టు అందుకే ఈ రకంగా వ్యవహరించాడని ఆయన అభిప్రాయపడ్డారు.

అమర్ ను అంకుల్ అంటూ సంబోధించిన అఖిలేష్

అమర్ ను అంకుల్ అంటూ సంబోధించిన అఖిలేష్

పార్టీ సంక్షోభానికి అమర్ సింగ్ తిరిగి పార్టీలో చేరడమే ప్రధాన కారణమని అఖిలేష్ వర్గీయులు ఆరోపించారు. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్న తర్వాత అఖిలేష్ యాదవ్ పార్టీ నుండి అమర్ సింగ్ ను బహిష్కరించారు.అయితే ఓ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్ అమర్ సింగ్ ను అంకుల్ అంటూ ఆప్యాయంగా పలకరించారు.

అఖిలేష్ సర్కార్ కు ఎదురు దెబ్బ

అఖిలేష్ సర్కార్ కు ఎదురు దెబ్బ

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 17 బిసి ఉపకులాలను ఎస్ టి జాబితాలో చేర్చుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై అలహబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. బిసిల ఓట్లను తిప్పుకొనే ఉద్దేశ్యంతో అఖిలేష్ చేసిన ప్రయత్నం కోర్టు స్టే తో బెడిసి కొట్టింది.గత ఏడాది డిసెంబర్ 22వ, తేది యూపి మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై బిసిల్లో అత్యంత వెనుకబడిన ఉప కులాలు 17 ఎస్ టిల్లో చేర్చుతూ నిర్ణయం తీసుకొన్నారు.ఎస్ సి, ఎస్ టి రీసెర్చ్ ,ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ఆదారంగాన కులాల విలీనానికి సంబందించి 2013 లోనే అసెంబ్లీ తీర్మాణాన్ని ఆమోదించింది.కానీ, జివో ఎన్నికల ముందు విడుదలైంది. 2004 లో కూడ ములాయం ఇదే తరహలో ఇవే కులాలను ఎస్ సి కేటగిరిలో చేర్చేందుకు జివో జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో ఈ ఆదేశాలు నిలిచిపోయాయి.

English summary
rahul and akhlesh dynamic leaders raboert vadra appreciated, he posted a comment on face book about samajwadi, congress party alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X