వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్: ఇంగ్లీష్‌లో రాసుకొచ్చి హిందీలో(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి సుష్మా స్వరాజ్‌లపై మండిపడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే అదంతా హిందీలో మాట్లాడేందుకు ఇంగ్లీష్‌లో రాసుకొచ్చారని ఆయన వద్ద ఉన్న పేపర్లతో తేలిపోయింది. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారనున్న ఆయన ఈ విధంగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా, సోషల్ మీడియాలో రాహుల్‌ స్పీచ్ హల్‌చల్‌గా మారింది. రాహుల్‌ ప్రసంగ ధార వెనుక ‘హింద్లీష్‌' మర్మం దాగి ఉందంటూ ఓ ఫొటో ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ‘హింద్లీష్‌' అంటే మరేమిటో కాదు! తాను హిందీలో చెప్పాలనుకున్న ముఖ్యాంశాలను ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో కాగితంపై రాసుకుని రావడం.

Rahul Gandhi 'cheat sheet' for Parliament speech caught on camera

రాహుల్‌ చేతిలో ఉన్న ఈ కాగితాలు కెమెరాలకు చిక్కాయి. ‘లోగ్‌ పీఎం మోదీ కో సున్నా చాహ్‌తాహై, వో ఉన్‌కీ రాయ్‌ జాన్‌నా చాహ్‌తే హై''... వంటి హిందీ పదాలను ఇంగ్లీషులో అదీ పెద్ద అక్షరాలతో రాసుకొచ్చుకున్నారు. సమావేశం అనంతరం తాను రాసుకున్న పేపర్లతో రాహుల్ బయటకు వస్తుండగా మీడియా కెమెరాలకు చిక్కాయి.

రాహుల్ చేసిన పనిపై పలువురు నెటిజన్లు విమర్శల వర్షంకురిపించగా, మరికొందరు సమర్థించారు. రాహుల్‌కు హిందీ రాదా?, దేవనాగరి లిపిని ఇంగ్లీష్ రాయడమేంటని కొందరు ప్రశ్నించగా, ప్రజాస్వామ్య దేశంలో రాహుల్ గాంధీకి రాసుకునే స్వేచ్ఛ కూడా ఉండకూడదా?.. ఇందులో చర్చించాల్సిన అంశమేముందని మరికొందరు సమర్థించారు.

English summary
In Parliament on Wednesday, Rahul Gandhi responded to Foreign Minister Sushma Swaraj's attack with an acrimonious counter that also included digs at Prime Minister Narendra Modi. The Congress vice president apparently made notes of his talking points, which was captured by an alert photographer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X