మోడీ మీద రాహుల్ గాంధీ ఫైర్: మధ్యలో మీ పెళ్లి ఎప్పుడని ప్రశ్న, యువరాజు సమాధానం!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారతదేశంలో మోస్ట్ ఎలిజిబల్ బ్యాచులర్ ల లిస్టులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా, ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులతో భేటీ అయినా ఎదురైయ్యే ప్రశ్న మీ పెళ్లి ఎప్పుడు అని. కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న రాహుల్ గాంధీకి మరోసారి మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించడంతో ఆయన సమాధానం ఇచ్చారు.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంజనీరింగ్ కాలేజ్

కర్ణాటకలోని కలబురగిలోని పీడీఏ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణంలో మంగళవారం రాహుల్ గాంధీ విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రైతులతో సమావేశం అయ్యి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ వివిధ రంగాలకు చెందిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!
  ఆర్ఎస్ఎస్ జోక్యం

  ఆర్ఎస్ఎస్ జోక్యం

  కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలో ఆ శాఖల మంత్రులు, అధికారుల మాట చెల్లుబాటు కావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ ఏదైనా చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖ అధికారులు వినాల్సిందే అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కేంద్రంలో ఎక్కువ జోక్యం చేసుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

   నోట్ బ్యాన్ ఎవరిది ?

  నోట్ బ్యాన్ ఎవరిది ?

  పెద్దనోట్లు రద్దు చెయ్యాలని ఆర్ బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చిన సలహాకాదని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్ లోని ఓ ప్రముఖుడు నోట్ బ్యాన్ చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచిస్తే ఆయన దానిని అమలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

  గబ్బర్ సింగ్

  గబ్బర్ సింగ్

  జీఎస్ టీని మరోసారి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటి వరకూ వ్యాపారులు, ప్రజలకు జీఎస్ టీ గురించి అర్థం కావడంలేదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే వ్యాపారులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న జీఎస్ టీకి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పులు చేర్పులు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

  మీ పెళ్లి ఎప్పుడు ?

  మీ పెళ్లి ఎప్పుడు ?

  ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలో అదే సమావేశానికి హాజరైన ఓ వ్యక్తి పైకిలేచి గట్టిగా మీ పెళ్లి ఎప్పుడు రాహుల్ జీ అని ప్రశ్నించారు. ఆ సమయంలో సభలో ఒక్కసారిగా నిశభ్ద వాతావరణం నెలకొంది.

  రాహుల్ సమాధానం

  రాహుల్ సమాధానం

  ముఖాముఖి కార్యక్రమంలో అంతసేపు సీనియస్ గా కేంద్రంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ ఒక్కసారిగా నవ్వేశారు. ఈ ప్రశ్న అడిగినందకు మీకు ధన్యవాదాలు. వేధిక మీద ఉన్న పెద్దలు తనను ఎప్పుడూ ఇదే ప్రశ్న అడుగుతుంటారని లోక్ సభలో ప్రతిపక్ష నాయుడు మల్లికార్జున ఖార్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ వైపు చూస్తూ రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అయితే మొత్తం మీద పెళ్లి విషయంలో రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇవ్వలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AICC president Rahul Gandhi said central government working on RSS's advice. centrals foreign policy is not correct, it let India stand alone in Asia continent. AICC president Rahul Gandhi asked about his marriage in Kalaburagi in a public program. He simply smiles and said 'thanks for the question, party seniors were also asking the same question'

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి