యుద్ధం ముగిసింది.. కర్మఫలం ఎదురుచూస్తోంది! మోడీకి రాహుల్‌ గాంధీ కౌంటర్..!

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ‌పై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజీవ్ గాంధీ నెంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించుకున్నారన్న ప్రధాని మోడీ కామెంట్లపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. "మోడీ జీ.. యుద్ధం ముగిసింది. ఖర్మ ఫలం ఎదురుచూస్తోంది. నా తండ్రిపై చేసే విమర్శలు మిమ్మల్ని ఎన్నటికీ కాపాడలేవు, ప్రేమతో ఓ కౌగిలింత" అంటూ ట్వీట్ చేశారు.

రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. మాజీ ప్రధానిపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారణేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయవద్దని బీజేపీ నిర్ణయించిన విషయం మోడీకి తెలుసా అని ప్రశ్నించారు. ప్రజా సేవలో ఉండి మరణించిన వ్యక్తిని విమర్శించి మోడీ అన్ని హద్దులు దాటేశారని చిదంబరం మండిపడ్డారు.

Rahul Gandhi Says Karma Awaits, A Huge Hug To PM Modi

మరోవైపు మోడీ కామెంట్లపై ప్రియాంక గాంధీ సైతం స్పందించారు. అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు అడిగే మోడీ.. ఒక గొప్ప వ్యక్తి బలిదానాన్ని అగౌరవపర్చడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. మోడీకి అమేథీ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని ప్రియాంక అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+