దళితులతో కలిసి భోజనం వండి, తిన్న రాహుల్ గాంధీ-అనుభవాలతో వీడియో ట్వీట్..!
మన దేశంలో దళితుల గురించి రాజకీయ పార్టీలో, కొన్ని వర్గాల్లో అప్పుడప్పుడూ మాట్లాడుకోవడం మాత్రమే వినడం, చూడటం తెలుసు. కానీ దళితుల ఇళ్లలో భోజనం ఎలా ఉంటుంది, వాళ్లు ఏమేం తింటారన్న దానిపై మాత్రం చాలా తక్కువ మందికే తెలుసంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని ఓ దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడ వారితో కలిసి వంట చేయడంతో పాటు ఆరగించారు కూడా. ఈ వీడియోను ఎక్స్ లో ఆయన ట్వీట్ చేశారు.
నేటికీ దళితుల వంటగది గురించి చాలా తక్కువ మందికి తెలుసని, షాహూ పటోలే జీ అన్నట్లు, దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ వివరించారు. వారు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి అనే ఆసక్తితో తాను, అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో ఓ మధ్యాహ్నం గడిపినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న ఆయన ఇంటికి తనను చాలా గౌరవంగా ఆహ్వానించాడని, వంటగదిలో తనకు సహాయం చేయడానికి అవకాశం కూడా ఇచ్చాడని రాహుల్ తెలిపారు.

తాము కలిసి 'హర్భార్యాచి భాజీ', చిక్‌పీ ఆకుకూరలు, వంకాయతో 'కందిపప్పు' కూరగాయ వండినట్లు రాహుల్ వెల్లడించారు. పటోలే జీ, సనాడే కుటుంబానికి కులం, వివక్షతో వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతూ తాము దళితుల వంటకాల గురించి అవగాహన లేకపోవడం, ఈ సంస్కృతి ని డాక్యుమెంటేషన్ చేయడం గురించి చర్చించినట్లు రాహుల్ తెలిపారు. రాజ్యాంగం బహుజనులకు భాగస్వామ్యాన్ని, హక్కులను కల్పించిందని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని తెలిపారు. అయితే ప్రతి భారతీయుడు తన హృదయంలో సోదర భావంతో కృషి చేసినప్పుడే సమాజంలో అందరినీ కలుపుకునే సమానత్వం సాధ్యమవుతుందన్నారు.
दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”
— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024
वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te












Click it and Unblock the Notifications