Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకే మోడీకి హగ్ ఇచ్చా: ఉగ్రవాదులవుతారంటూ రాహుల్ వివాదాస్పదం, భారతీయ పురుషులపైనా..

న్యూఢిల్లీ/బెర్లిన్: లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీకి కౌగిలింత ఇచ్చిన విషయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ తన పట్ల ద్వేషపూరితంగా మాట్లాడినందుకే తాను ఆలింగనం చేసుకున్నానని రాహుల్ తెలిపారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన రాహుల్‌.. హాంబర్గ్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోడీకి ఇచ్చిన ఆలింగనం గురించి మాట్లాడారు.

నా హగ్ మోడీతోపాటు కాంగ్రెస్ నేతలకూ నచ్చలేదు

నా హగ్ మోడీతోపాటు కాంగ్రెస్ నేతలకూ నచ్చలేదు

నెల రోజుల క్రితం ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడిన అనంతరం మోడీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మోడీకి తన ప్రవర్తన నచ్చలేదని, కాంగ్రెస్‌ పార్టీలో కొందరు సీనియర్‌ నేతలకు కూడా తాను మోడీని హగ్‌ చేసుకోవడం నచ్చలేదని రాహుల్‌ వెల్లడించారు.

మోడీకి అందుకే హగ్ ఇచ్చా..

మోడీకి అందుకే హగ్ ఇచ్చా..

పలువురు నేతలు తర్వాత తన దగ్గరికి వచ్చి అలా హగ్‌ చేసుకోవద్దని చెప్పారని రాహుల్ గాంధీ తెలిపారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమని గాంధీ చెప్పారని, అందుకే మోడీ ద్వేషపూరితంగా మాట్లాడినందుకు తాను ఆలింగనం చేసుకున్నానని రాహుల్‌ వివరణ ఇచ్చారు.

ఉగ్రసంస్థలంటూ వివాదాస్పద హెచ్చరిక

ఉగ్రసంస్థలంటూ వివాదాస్పద హెచ్చరిక

జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గురువారం బ్యుసెరియస్‌ సమ్మర్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలని, కొన్ని వర్గాల ప్రజలను పట్టించుకోకపోతే ఉగ్రసంస్థలు పుట్టుకొస్తాయని రాహుల్‌ గాంధీ వివాదాస్పద హెచ్చరించారు. 21వ శతాబ్దంలో ప్రజలకు మీరు ఓ విజన్‌ ఇవ్వకపోతే మరెవరో వారికి విజన్‌ ఇస్తారని, అది పెద్ద ప్రమాదంగా మారుతుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

భారతీయ పురుషులపై..

భారతీయ పురుషులపై..

గిరిజనులు, దళితులు, మైనార్టీలను బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయట్లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. వారిని అభివృద్ధి నుంచి దూరం చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఆ తిరుగుబాటు నెమ్మది నెమ్మదిగా ఐఎస్‌ఐఎస్‌గా మారుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, భారతీయ పురుషులు మహిళలను తమతో సమానంగా చూడరంటూ వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ మనదేశంలోనే గాక, విదేశాలకు వెళ్లి కూడా అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. కనీస జ్ఞానం లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+