బీజేపీ ఎఫ్ క్ట్: సూపర్ స్టార్ రజనీకాంత్ వెనకడుగు: ఆకస్మికంగా తొలగించిన హీరో!

Posted By:
Subscribe to Oneindia Telugu
  రజనీకాంత్ వెనకడుగు :బాబా ముద్రలో ని తెల్లటి తామరపువ్వు తొలగించడానికి కారణం !

  చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రాజకీయ రంగప్రవేశం జరిగిపోయింది. చెన్నైలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపంలో డిసెంబర్ 31వ తేదీ వరకు అభిమానులతో వరుసగా సమావేశం అయిన రజనీకాంత్ అదే రోజు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాబా గుర్తు విషయంలో రజనీకాంత్ వెనకడుగు వేశారు.

  ఉద్యమాలు చెయ్యడానికి నేనే సిద్దంగా ఉన్నా, భవిష్యత్తులో, అందుకే: రజనీకాంత్!

  రజనీకాంత్ జరిపిన సమావేశంలో వెనుక బాబా ముద్ర గుర్తు ఉన్న ఫోటో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ విడుదల చేసిన వెబ్ సైట్ (రజనీమండ్రం వెబ్ సైట్ ) లో బాబా ముద్రలో ఉన్న తెల్లటి తామరపువ్వును ఆకస్మికంగా తొలగించారు.

  హిమాలయాల్లో బాబాజీ!

  హిమాలయాల్లో బాబాజీ!

  రజనీకాంత్ ఆధ్యాత్మికత జీవితం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. హిమాలయాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని విశ్వసించే ఆధ్యాత్మిక గురువు బాబాజీని రజనీకాంత్ పూజిస్తారు. బాబాజీ చూపే ముద్రతోనే రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు.

   రజనీకాంత్ బాబా గుర్తు

  రజనీకాంత్ బాబా గుర్తు

  హిమాలయాల్లో ఇప్పటికే సజీవంగా ఉన్నారని విశ్వసించే బాబాజీ కుడిచేతి చూపుడు వేలు, చిటికెన వేలు పైకెత్తి మిగిలిన మూడు వేళ్లను ముడిచి వుంచే ముద్రను ఆబాణ ముద్ర అని పిలుస్తారు. రజనీకాంత్ అభిమానులతో ఏర్పాటు చేసిన అన్ని సమావేశాల్లో వెనుక కచ్చితంగా ఆముద్ర ఉంటుంది. అందులో బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంటుంది.

  రజనీకాంత్ వెనకడుగు

  రజనీకాంత్ వెనకడుగు

  బీజేపీ గుర్తు తామరపువ్వు. రజనీకాంత్ ఉపయోగిస్తున్న బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంది. రజనీకాంత్ కచ్చితంగా బీజేపీతో జతకడుతారని దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం భవిష్యత్తులో తనకు చేటు తెస్తోందని రజనీకాంత్ ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

   తామరపువ్వు తొలగింపు

  తామరపువ్వు తొలగింపు

  రాజకీయ రంగప్రవేశం జరిగే సమయంలో బీజేపీతో కొంతదూరంగా ఉండటం మంచిదని భావించిన రజనీకాంత్ బాబా గుర్తులో ఉన్న తెల్లటి తామరపువ్వును ఆకస్మికంగా తొలగించారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. బీజేపీ చిహ్నం తామరపువ్వు అయినందున తన బాబా గుర్తులో తెల్లటి తామరపువ్వు తొలగించి కేవలం బాబా గుర్తు మాత్రం ఉపయోగించాలని రజనీకాంత్ నిర్ఱయించాని ఆయన సన్నిహితులు తెలిపారు.

  డీఎంకే గుర్తు

  డీఎంకే గుర్తు

  డీఎంకే పార్టీ గుర్తు సూర్యుడి గుర్తు. రామక్రిష్ణ పరమహంస చిహ్నంలో తామరపువ్వు, సూర్యుడు ఉదయించే గుర్తులు ఉన్నాయి. తన బాబా గుర్తులో తామరపువ్వు, సూర్యుడు ఉదయించే చిహ్నం ఉంటే కార్యకర్తలు అయోమయాని గురి అయ్యే అవకాశం ఉందని, ఓట్లు బీజేపీ, డీఎంకేకి పడే అవకాశం ఉందని యోచించిన రజనీకాంత్ సూర్యుడి గుర్తు, తామరపువ్వు గుర్తు తొలగించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

  అభిమానుల ఆందోళన

  అభిమానుల ఆందోళన

  డిసెంబర్ చివరి వారంలో జరిగిన సహావేశాలకు హాజరైన అభిమానులు ఆబాణ ముద్ర (బాబా ముద్ర) కింద తామరపువ్వు ఉన్న విషయం తెలిసి ఆందోళన చెందారు. అభిమాన సంఘాల నాయకులు రజనీకాంత్ కు బీజేపీ తామరపువ్వు విషయం గుర్తు చేసి ఈ విషయంలో మీరు ఆలోచిస్తే మంచిదని మనవి చేశారని, అందు వలనే ఆయన తామరపువ్వును తొలగించారని తెలిసింది.

  సత్యం, శ్రమ, ఉన్నతం

  సత్యం, శ్రమ, ఉన్నతం

  ఆబాణ ముద్ర ఉన్న చిహ్నం కింద తమిళ బాషలో సత్యం, శ్రమ, ఉన్నతం అనే మూడు వ్యాఖ్యాలను రజనీకాంత్ పొందుపరిచారు. తమిళనాడు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రతలు తీసుకోవడానికే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ బాబా గుర్తులో తామరపువ్వు వెంటనే తొలగించారని తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  South Indian Superstar Rajinikanth has removed the White Lotus image from his 'Baba Symbol' in http://www.rajinimandram.org website.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి