నీ ముఖంలా ఉంది!: మహిళా జర్నలిస్ట్‌పై వర్మ, సారీ
ముంబై: వరుస వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటిసారి క్షమాపణలు చెప్పాడు. తన తాజా చిత్రం వీరప్పన్ పైన నెగిటివ్ రివ్యూ రాసిన రాయిటర్స్ వార్తా సంస్థ జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్ పైన వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ నేపథ్యంలోనే ఆమెకు క్షమాపణ చెబుతూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు తాను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని, తాను చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరాడు. తాను ట్విట్టర్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఫాలో అవుతున్నానని, అందుకే అలా మాట్లాడానని చెప్పాడు. ఆమె గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వాటిని తొలగించాడు.
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వీరప్పన్ పైన ఆమె నెగిటివ్ రివ్యూ రాశారు. దీంతో ఆమె పైన వర్మ మండిపడ్డడు. అంతేకాదు, ఆమె ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. నీ ముఖమంతా అందంగా వీరప్పన్ ఉందని కామెంట్ పెట్టాడు. తర్వాత ఆమెకు సారీ చెప్పాడు.
Maybe I had too much Trump or maybe not enough Vodka but whatever it is I am sorry once again pic.twitter.com/smnS05YyCz
— Ram Gopal Varma (@RGVzoomin) May 28, 2016












Click it and Unblock the Notifications