దేశవ్యాప్తంగా మార్కెట్ లో పతంజలి కరోనిల్ కిట్ .. ఎలాంటి ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబా

కరోనా నియంత్రణ కోసం రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు.పతంజలి ఆయుర్వేద్ యొక్క స్వసరి కరోనిల్ కిట్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని యోగా గురు రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు పతంజలి సరైన విధంగా పని చేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తెలిపిందని ఆయన అన్నారు..

కరోనిల్ కిట్ మందుల కోసం లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుష్ శాఖ ఇచ్చిందని పేర్కొన్నారు . ఆయుష్ మంత్రిత్వ శాఖతో మాకు విభేదాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, కరోనిల్, స్వాధారి, గిలోయ్, తులసి, అశ్వగంధపై ఎటువంటి ఆంక్షలు లేవని రాందేవ్ బాబా పేర్కొన్నారు ఈ రోజు నుండి, ఈ మందులు (స్వాసరి కరోనిల్ కిట్) దేశంలో ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేకుండా లభిస్తాయని స్పష్టం చేశారు. మెడిసిన్ పై ఎటువంటి ఆంక్షలు లేకుండా మార్కెట్ లోకి విడుదలకు అంగీకరించినందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు రాం దేవ్ బాబా .

Ramdev baba said no restrictions on Patanjali Coronil kit.. available nation wide

వారం రోజుల క్రితం పతంజలి ఆయుర్వేద్ 'కోరోనిల్ మరియు స్వాసరి' ను కరోనా చికిత్సకు ఆయుర్వేద నివారణ అని పేర్కొంది . దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అనుకూలమైన ఫలితాలను ఇచ్చాయని మూడు రోజుల్లోనే రోగి కోలుకున్నారని పేర్కొంది. కరోనిల్ కిట్ విడుదల చెయ్యటం ఆ తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం, దానికి సమాధానంగా కరోనాకు తాము మందు కనిపెట్టామని చెప్పలేదని సమాధానం ఇవ్వటం వంటి అనేక పరిణామాల మధ్య మొత్తానికి రాందేవ్ బాబా కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని పేర్కొనటం ఆసక్తికర అంశం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+