వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరి ఎదుటే యువతిని చంపాడు, సహజీవనం ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rape accused stones girlfriend, slits throat
నైనిటాల్: నైనిటాల్‌లో దారుణం జరిగింది. 27 ఏళ్ల ఓ యువకుడు ఓ యువతిని ఆమె సోదరి ముందు రాళ్లతో కొట్టి, అనంతరం ఆమె గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన నైనిటాల్ జిల్లాలోని రాంనగర్ పోలీసు స్టేషన్ పరిధి ఫారెస్ట్ ఏరియాలో జరిగింది. మృతురాలి వయస్సు 22.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో అమ్మాయిని కొట్టి చంపిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె కొట్టడం వల్లనే చనిపోయినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తేలింది. తలకు బలంగా గాయాలు కావడం వల్ల ఆమె చనిపోయినట్లు చెప్పారు.

కాగా, పోలీసులు మరో విషయం చెప్పారు. నిందితుడిని హరిసింగ్‌గా గుర్తించినట్లు చెప్పారు. ఇతని పైన గత జనవరిలో మృతురాలు అత్యాచార కేసు పెట్టినట్లుగా చెప్పారు.

అనంతరం మెజిస్ట్రేట్ కోర్టు ముందు మృతురాలు అతనికి అనుగుణంగా స్టేట్‌మెంట్ ఇచ్చిందట. తాను కేసు పెట్టిన యువకుడితో తనకు రిలేషన్‌షిప్ ఉందని, అతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఆమె తన స్టేట్‌మెంట్‌లోకోరిందట. ఆమె రిపోర్ట్‌ను తీసుకున్న తర్వాత ఫిబ్రవరిలో తుది నివేదికను పంపించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి వచ్చిందని, ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గిందని పోలీసుల విచారణలో తేలిందట. ఈ నేపథ్యంలో నిందితుడు ఆమెను పెళ్లి గురించి మాట్లాడుదాం.. రమ్మని ఫారెస్ట్ ఏరియాకు పిలిపించాడు. ఆమె తన సోదరితో కలిసి శనివారం వచ్చింది.

ఆమె రాగానే హరి.. ఆమె పైన రాళ్లతో దాడి చేశాడు. అనంతరం ఓ చాకుతో ఆమె గొంతు కోశాడు. ఈ సంఘటన మృతురాలి సోదరి ఇంటికి తిరిగి వచ్చాక వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు దీని పైన ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడు ఉపయోగించిన చాకు, రాళ్లను తీసుకున్నారు. హరితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary

 A 27 year old youth allegedly murdered a girl with stones in presence of her younger sister in the forest area under Ramnagar police station of Nainital district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X