ఆమెను రేప్ చేయండి: ఫేస్‌బుక్‌లో ఆర్ఎస్ఎస్ వ్యక్తి

హైదరాబాద్: మహిళా కార్యశీలిపై అసభ్యకరమైన సందేశాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుడు విఆర్ భట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆమె వంటి యాక్టివిస్టులపై అత్యాచారం చేయాలని అతను ఓ వ్యాఖ్యను పోస్టు చేశాడు. హిందూత్వం పట్ల వారి వైఖరిని సరి చేయడానికి వెంట్రుకలు పట్టుకని ఈడ్చి, లైంగిక దాడి చేయాలని అతను అన్నాడు.

దేశాభివృద్ధికి కింది స్థాయి ప్రజలు చాలా సేవలు చేశారని, మతపరమైన వర్గానికి చెందిన కొంత మంది ఎగువ శ్రేణివారు ఆ క్రెడిట్‌ను కొట్టేస్తున్నారని ప్రభ ఎన్. బేలమంగళ పోస్టు చేశారు. దానికి సమాధానంగా అతను ఆ విధంగా వ్యాఖ్యలు పోస్టు చేశాడు.

Rape the activist: RSS man posts on facebook

బెలమంగళ (43) సమాజిక కార్యకర్త. ఆమె జనవిజ్ఞాన సమితి అనే ఎన్జీవోకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఇతర కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.

కర్ణాటక దళిత సంఘటనెగళ ఒక్కుట్ట అధ్యక్షుడు బీఆర్ భాస్కర ప్రసాద్ నేలమంగళలో భట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుండా చట్టం కింద భట్‌పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు నమోదు కాగానే భట్ తాను పోస్టు చేసిన వ్యాఖ్యను తొలగించాడు. అయితే, ఫిర్యాదులు చేసినవారు దాని స్క్రీన్ షాట్ తీసుకున్నారు. భట్ అంతటితో ఆగకుండా సామాజిక కార్యకర్తకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+