Maharashtra & Jharkhand election results:డైలీహంట్ పై ఫలితాలు,విశ్లేషణలు ఇంకా చాలా..!!

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 20వ తేదీన ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు నవంబర్ 23వ తేదీన జరుగుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకేరోజు అంటే నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరుగగా.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు దశల్లో నవంబర్ 13వ తేదీ నవంబర్ 20వతేదీ జరిగింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 288 స్థానాలున్నాయి.288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3239 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఈసారి మాత్రం ఆ సంఖ్య 27.7శాతం పెరిగింది.2019లో ఎన్నికలు మొత్తం బీజేపీ-శివసేన, కాంగ్రెస్ -ఎన్సీపీ కూటమిల చుట్టూ తిరిగాయి. అయితే 2024 కల్లా మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గత రెండేళ్లలో జరిగిన పరిణామాలతో కూటములు విడిపోయి చేతులు మారాయి.

Real-Time Trends and Insights Dailyhunt s Coverage of Maharashtra Jharkhand Polls 2024

మహారాష్ట్రలో పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు

*బీజేపీ

*కాంగ్రెస్

*శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)

*శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం)

*ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)

*ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)

ఇక పోటీలో ఉన్న అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థులు 2086 మంది ఉన్నారు.ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలుండగా..ఇక్కడ పోలింగ్ రెండు విడతలుగా జరిగింది.నవంబర్ 13వ తేదీన 43 సీట్లకు తొలి విడత పోలింగ్ సందర్భంగా 683 మంది అభ్యర్థులు బరిలో నిలువగా అందులో 73 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఇక రెండవ దశ 38 స్థానాలకు నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరుగగా..528 మంది అభ్యర్థులు పోటీలో నిలిచార. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 1211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

డైలీ హంట్ పై ఎన్నికల కవరేజ్

ఎన్నికల కవరేజ్ విషయానికొస్తే డైలీహంట్ కొత్త స్టాండర్డ్స్‌తో మీ ముందుకొస్తోంది. సాదాసీదా అప్‌డేట్స్ కాకుండా మరింత లోతైన విశ్లేషణలు అందిస్తోంది.

* పూర్తి స్థాయిలో పార్టీ, అభ్యర్థి సమాచారం:అభ్యర్థుల ప్రొఫైల్

* రియల్ టైమ్ అప్‌డేట్స్: రియల్‌టైమ్‌లో ఎలక్షన్ వార్తలు, అందంగా రూపొందించి ఇతరులతో పంచుకునేలా డేటాతో కూడిన డిజైన్ కార్డ్స్

* పక్షపాతం లేని విశ్లేషణలు: ఓటర్ ట్రెండ్స్,పార్టీ వ్యూహాలపై వివరణ/విశ్లేషణ

* మల్టీమీడియా అనుభవం: లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, క్విజ్‌లు, నచ్చే విధంగా ఉన్న ఎన్నికల కథనాలు

వీటితో పాటు డైలీ హంట్ పై మరిన్ని ..

* ప్రత్యక్షంగా ఎన్నికల ఫలితాలు :సులభంగా చదివేలా ఉండే వేగవంతమైన అప్‌డేట్స్

* ట్రెండ్స్ పై విశ్లేషణ: గత ఫలితాలను పోలుస్తూ విశ్లేషణలు, రాష్ట్రవ్యాప్తంగా, నియోజకవర్గాల వారీగా అనాలిసిస్‌

* సోషల్ మీడియా రియాక్షన్స్: సోషల్ మీడియాపై ట్రెండ్ అవుతున్న చర్చలు

రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా అర్థమయ్యేలా లోతైన విశ్లేషణలు, రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరుకు వారి మధ్య జరిగే చర్చలు డైలీ హంట్ మినిట్-టూ-మినిట్ మీకు అందిస్తుంది.వేగవంతమైన అప్‌డేట్స్, ప్రముఖుల విశ్లేషణలు, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి,ఇలాంటి అంశాలతో పాటు మరిన్ని అప్‌డేట్స్ కోసం డైలీహంట్ పై ట్యూన్ అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+