Republic TV-P-Marq exit poll: హర్యానా ఫలితాలు ఏకపక్షమే-తేల్చేసిన రిపబ్లిక్ టీవీ..!
హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందన్న అంశంపై జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ తో కలిసి ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో ఈసారి అధికార బీజేపీకీ, విపక్ష కాంగ్రెస్ కీ మధ్య జరిగిన ముఖాముఖీ పోరులో హస్తవాసి కనిపించినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. ఇప్పటికే మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయం స్పష్టం చేశాయి.
హర్యానా అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 51-61 సీట్లు సాధించబోతున్నట్లు రిపబ్లిక్ టీవీ- పీ మార్క్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. బీజేపీ మాత్రం 27-35 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. జేజేపీకి 0-1 సీట్లు, ఐఎన్ఎల్డీ కూటమికి 1-5 సీట్లు, ఇతరులకు 4-9 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్ తెలిపింది. దీంతో అధికార ఏర్పాటుకు అవసరమైన 46 సీట్లను కాంగ్రెస్ సొంతంగానే సాధించబోతున్నట్లు తేలిపోయింది.

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా వీటిలో ఏడు పార్టీలు పోటీ చేసాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ముఖాముఖీ పోరు సాగిందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు వెయ్యి మంది అభ్యర్ధుల భవితవ్యం తేల్చబోతున్నారు. ఈ నెల 8న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications