TCS Layoffs: రిజైన్ చేస్తావా లేక..? టీసీఎస్ హెచ్ఆర్ స్వీట్ కాల్ షాక్..!

దేశంలో అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్ధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా ఆటోమేషన్, ఇతర కారణాలతో ఏకంగా 12 వేల మంది ఉద్యోగుల్ని వదిలించుకుంది. అయితే అంతకంటే దారుణం వారిని వదిలించుకున్న తీరేనన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. టీసీఎస్ నుంచి తప్పించిన ఉద్యోగులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ మేరకు వరుసగా తమ అనుభవాలను పోస్ట్ చేస్తున్నారు. టీసీఎస్ నుంచి తమను ఎలా బలవంతంగా రాజీనామా చేయించారో చెప్పేలా ఈ పోస్టులు ఉంటున్నాయి.

ఇలాంటిదే తాజాగా ఓ పోస్టు రెడ్డిట్ లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. ఇందులో 21 ఏళ్లుగా టీసీఎస్ లో పనిచేస్తున్న సదరు ఉద్యోగి .. ప్రాజెక్టు మేనేజర్లు, రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) కలిసి ఉద్యోగులతో ముందస్తు నోటీసులు లేకుండానే బలవంతంగా ఎలా రాజీనామాలు చేయిస్తున్నారో వివరించారు.

Resign Now or Face the Consequences HR s Call Raises Eyebrows in TCS Layoffs

ప్రాజెక్ట్ పనులపై పని చేస్తుండగా.. అకస్మాత్తుగా ప్రాజెక్ట్ మేనేజర్ లేదా డెలివరీ మేనేజర్ మీకు కాల్ చేసి, మీ అదే పాత్రకు మరొక ఖాతాలో అత్యవసర అవసరం ఉందని తెలియజేస్తారని, ఆమె నేను మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ నుండి విడుదల చేస్తున్నాను, మీరు మరొక ఖాతాలో చేరతారని, మరిన్ని వివరాల కోసం ఆర్ఎంజీ కాల్ చేస్తుందని చెప్పారన్నారు. కొన్ని నిమిషాల్లోనే మీరు రిలీజ్ అయ్యారని ఆర్ఎంజీ నుండి ఇమెయిల్ వస్తుందని, కస్టమర్ కు మేనేజర్ కొన్ని కారణాల వల్ల తాము అతన్ని రిలీజ్ చేయాల్సి వచ్చిందని చెప్తారన్నారు.

అనంతరం ఉద్యోగులు కంపెనీలో ఇతర ప్రాజెక్టుల కోసం వెతకవలసి ఉంటుందన్నారు. కానీ ఇలాంటి ప్రాజెక్టులకు ఉద్యోగుల కేటాయింపులకు ఆమోదాలను ఆర్ఎంజీ నిలిపివేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఉద్యోగి తదుపరి దశను ఒత్తిడిలో హెచ్ఆర్ కు పిలిపించినట్లు వివరించాడు. ఆఫీసు ముందు క్యూ చూసి ఆశ్చర్యపోయి లోపలికి వెళ్లానని, హెచ్ ఆర్ .. మీరు రాజీనామా చేయాలి, లేకపోతే మేము మీకు చెడు ఫీడ్ బ్యాక్ ఇస్తామని చెప్పారన్నారు. తాను కష్టపడి పనిచేశాను. గత 4 సంవత్సరాల నుండి బ్యాండ్ ఉంది , మంచి రేటింగ్ ఉంది అని చెప్పగా.. హెచ్ ఆర్ ఫుల్ సెటిల్ మెంట్లో మీకు 3 నెలల జీతం వస్తుందని చెప్పి పంపేస్తున్నట్లు తెలిపారు.
తద్వారా 35 రోజుల రూల్ లేకుండానే రాజీనామా వెంటనే ఆమోదించబడిందని ఉద్యోగి పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+