వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుషికేశ్ లక్ష్మణ్ బ్రిడ్జీకి ముప్పు, నిపుణుల వార్నింగ్, రాకపోకలు నిలిపివేత

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్ : ప్రముఖ పుణ్యక్షేత్రం రుషికేష్‌ వెళ్లిన వారు తప్పకుండా లక్ష్మణ్ జులా బ్రిడ్జీపై జర్నీ చేస్తారు. రిషికేష్‌లోని గంగా నదీపై 90 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. అయితే ఇటీవల ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. రిషికేష్ వచ్చిన ప్రతి ఒక్కరు లక్ష్మణ్ జులా బ్రిడ్జీపై పయనించి కొత్త అనుభూతి పొందుతారు. అయితే ఇది నిర్మించి చాలాకాలం అవడం, ఎక్కువ మంది ప్రయాణించడంతో తట్టుకోలేదని నిపుణులు తెలిపారు. వెంటనే మూసివేయాలని చెప్పడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఆహా.. అనుభూతే వేరు
లక్ష్మణ్ జులాపై జర్నీ చేసే ప్రయాణికులు గణనీయంగా పెరగడంతో శుక్రవారం దానిపై నుంచి ప్రయాణాలను ఆపివేశారు. నిపుణుల సూచన మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. లేదంటే లక్ష్మణ్ జులా కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రయాణికులు, వాహనాలను వెంటనే నియంత్రించినట్టు అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఓం ప్రకాశ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రయాణికుల రద్దీ పెరగడంతో లక్ష్మణ్ జులా బ్రిడ్జీ ఒకవైపునకు వంగిందని కూడా పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాహనాలను అనుమతిస్తే బ్రిడ్జీ కూలిపోయే ప్రమాదం ఉందని, అందుకే నిలిపివేసినట్టు తెలిపారు.

Rishikeshs 90-year-old Lakshman Jhula shut after experts call it a threat and beyond repair

రిషికేశ్‌లో 1923లో లక్ష్మణ్ జులా అనే బ్రిడ్జీని నిర్మించారు. అయితే మమూలు బ్రిడ్జీ కాదు. కింద గంగా నదీ పారుతుంటే .. పైనుంచి బ్రిడ్జీ ఉంటుంది. ఇక్కడ ద్విచక్ర వాహనాలను కూడా అనుమతిస్తారు. చూడడానికి బాగుంటుంది. యాత్రికులు వచ్చి ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడుతారు. అంతేకాదు సినిమాలు, సీరియళ్లు కూడా ఈ బ్రిడ్జీపై షూట్ చేశారు. ఈ బ్రిడ్జీ తెహ్రీ జిల్లాలో తపోవన్ గ్రామం నుంచి పౌరి జిల్లాలోని జంక్ గ్రామాలను కలుపుతుంది. ఇది పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది.

English summary
lakshman Jhula, the iconic suspension bridge across the Ganga in Rishikesh, was closed to traffic Friday as experts feel it cannot sustain more load, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X