
గడ్కరీ తొలగింపు వెనుక ? సొంతనేతపై ఆరెస్సెస్ ఆగ్రహం అందుకే ! వినకపోతే బీజేపీ బహిష్కరణే !
ఆరెస్సెస్ నేపథ్యంతో బీజేపీలోకి వచ్చి అత్యున్నత స్ధాయికి ఎదిగిన నేతల్లో ఒకరైన నితిన్ గడ్కరీని తాజాగా ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. సాధారణ పరిస్ధితుల్లోనో, మరో నేత విషయంలోనో అయితే ఈ నిర్ణయం పెద్దగా చర్చకు తావిచ్చేది కాదేమో కానీ ఆరెస్సెస్ నుంచి వచ్చి బీజేపీలో కీలక స్ధానంలో ఉన్న గడ్కరీ విషయంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు సగటు కార్యకర్తకు సైతం మింగుడు పడటం లేదు. అయితే సొంత నేత అయిన గడ్కరీపై వేటుకు ఆరెస్సెస్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

నితిన్ గడ్కరీపై వేటు
బీజేపీ
పార్టీ
పార్లమెంటరీ
బోర్డు
నుండి
అగ్రనేత,
మోడీ
కేబినెట్లో
రవాణా
శాఖ
మంత్రిగా
ఉన్న
నితిన్
గడ్కరీని
తొలగిస్తూ
ఆశ్చర్యకరమైన
నిర్ణయం
తీసుకోవడం
ద్వారా
కాషాయ
పార్టీ
అందరినీ
ఆశ్చర్యానికి
గురిచేసింది.
బీజేపీతో
అత్యున్నత
నిర్ణాయక
మండలి
అయిన
పార్లమెంటరీ
బోర్డు
నుంచి
గడ్కరీ
నుంచి
తప్పించడం
తన
కేబినెట్
సహచరుల్నే
కాదు,
పార్టీలో
ఎప్పటి
నుంచో
కొనసాగుతున్న
ఎందరో
సీనియర్లకు
సైతం
షాకిచ్చింది.
గడ్కరీ
పరిస్ధితే
ఇలా
ఉంటే
తమ
పరిస్ధితి
ఏంటన్న
ఆలోచనలో
కూడా
పడేసింది.

కొంపముంచిన ఆ వ్యాఖ్యలు
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు కూడా అయిన నితిన్ గడ్కరీ ఆరెస్సెస్ మూలాలున్న వ్యక్తి మాత్రమే కాదు ప్రస్తుతం మోడీ కేబినెట్లో మోడీ-షా ద్వయం తర్వాత అత్యంత ప్రభావవంతమైన నాయకుడు కూడా. అయితే తాజాగా గడ్కరీ రాజకీయాలపై, నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మోడీ-షా ద్వయాన్ని టార్గెట్ చేస్తూ చేసినవే అంటూ ప్రత్యర్ధులు బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంతిమంగా గడ్కరీ వ్యాఖ్యలతో మోడీ-షా ఇరుకునపడటం మొదలైంది. ఇప్పటికే విపక్షాలతో పాటు ప్రత్యర్ధులు కూడా మోడీ-షా ద్వయంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు వారికి వరంగా మారిపోతున్నాయి.

ఆరెస్సెస్, బీజేపీ హెచ్చరికలు
గడ్కరీ వ్యాఖ్యలతో మోడీ-షా ద్వయం ఇరుకునపడటమే కాకుండా ప్రత్యర్ధులకు అస్త్రాలు ఇచ్చినట్లు అవుతోందంటూ బీజేపీ, ఆరెస్సెస్ కు చెందిన పలువురు నేతలు గడ్కరీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినా గడ్కరీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే మోడీ-షా ద్వయం బీజేపీని నడుపుతున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న గడ్కరీ.. తన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేందుకు ససేమిరా అన్నారు. నితిన్ గడ్కరీ సంఘ్ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. దీంతో గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు ఆపకపోతే చర్యలు తప్పవని ఆరెస్సెస్ తుది హెచ్చరికలు జారీ చేసింది.

ఆరెస్సెస్ గ్రీన్ సిగ్నల్ తో గడ్కరీపై వేటు
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించడం సహా బీజేపీ తగిన చర్యలు తీసుకోవచ్చని ఆర్ఎస్ఎస్ నాయకత్వం బీజేపీ నాయకత్వానికి సూచించింది. గడ్కరీ ప్రకటనలతో ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకత్వానికి, 'గడ్కరీ ఆపకపోతే తదుపరి చర్యలు తీసుకుంటా' అంటూ బీజేపీ నేతపై సంఘ్ కఠిన వైఖరి తోడైంది. ఆ తర్వాత పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయన్ను తొలగించారు. వ్యక్తి స్థాయితో సంబంధం లేకుండా, సంస్థాగత ప్రవర్తనా నియమాలకు విరుద్ధంగా వెళ్లడానికి అనుమతించరాదని బిజెపి, సంఘ్ నాయకత్వం రెండూ ఏకీభవిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు ఆపకపోతే భవిష్యత్తులో బీజేపీ నుంచి బహిష్కరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.