రూపే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా?

యూపీఐ చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో అన్ని బ్యాంకులు ఈ కార్డులను జారీచేస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంక్ ఖాతాల నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేసేవారు. ఇప్పుడు మాత్రం క్రెడిట్ కార్డుల నుంచి కూడా చేసే వీలుండటంతో దీని ఉపయోగం ఎక్కువైంది.

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ లో క్రెడిట్ కార్డను అనుసంధానం చేసుకోవచ్చు. ఎక్కడైనా స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. అయితే పర్సన్స్ కు పంపించడానికి, వ్యాలెట్ లోడింగ్ కు మాత్రం అవకాశం లేదు. క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేయడంద్వారా ఎన్ని ప్రయోజనాలో తెలుసుకుందాం.

rupay credit card uses

* ఒకచోట క్రెడిట్ కార్డు, మరోచోట యూపీఐ వాడాల్సిన అవసరం ఉండదు. చేతిలో పోన్ ఉంటే చెల్లించేయవచ్చు. ప్రతిసారీ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు.

* రూపే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లు పొందొచ్చు.

* స్వైప్ మెషిన్లు లేని చిన్న చిన్న దుకాణాల్లో యూపీఐ ద్వారా రూపేను వినియోగించుకోవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా ఎండీఆర్ ఛార్జీలు ఉండవు.

* నెలవారీ ఖర్చులకు పరిమితి పెట్టుకొని అంతవరకే చెల్లింపులు చేయవచ్చు. ఖర్చులను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డును వాడటంవల్ల ట్రాక్ చేయడం కుదరదు.
* బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు లేనప్పుడు రూపే క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. బిల్లు చెల్లించడానికి గడువు ఉంటుంది కాబట్టి వినియోగదారుడికి మంచి వెసులుబాటు ఉంటుంది.

* వీటిపై యాక్సిడెంటల్ కవరేజీ లభిస్తుంది. కార్డు రకాన్ని బట్టి కవరేజీ ఉంటుంది.

* క్రెడిట్ కార్డు వాడే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణ ఉండాలి. యూపీఐకి లింక్ చేస్తే మరింత జాగ్రత్త అవసరం. కార్డును లింక్ చేయడంద్వారా కొందరు అధికంగా ఖర్చు చేస్తారు. తద్వారా అప్పుల ఊబిలోకి దిగుతారు. ఖర్చులపై నియంత్రణ లేనివారైతే క్రెడిట్ కార్డు జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.*

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+