Crude Oil: ముడి చమురుపై రాయితీని తగ్గిస్తోన్న రష్యా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..!

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా క్రూడ్ ఆయిల్‌పై డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో భారత కంపెనీలు భారీగా చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. అయితే రష్యా ఇచ్చే రాయితీ ఇప్పుడు తగ్గింది. అంతేకాదు రష్యా ఏర్పాటు చేసిన రవాణా సంస్థలు విధించే షిప్పింగ్ ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయి. రష్యా.. భారతీయ రిఫైనర్‌లకు పశ్చిమ దేశాలు విధించిన బ్యారెల్ ధర పరిమితికి $60 కంటే తక్కువ ధరకే అమ్ముతోంది.

చమురు తరలించడానికి మాత్రం బ్యారెల్‌కు $11 నుంచి $19 మధ్య వసూలు చేస్తుంది. ఇది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, పశ్చిమ దేశాలు రష్యా చమురు దిగుమతులను తగ్గించాయి. ఇతర చోట్ల చమురును విక్రయించడం ద్వారా మాస్కో సంపాదించే ఆదాయానికి పరిమితిని విధించాయి. 2022 ఫిబ్రవరి నుంచి రష్యన్ నుంచి చమురు దిగుమతులు పెరిగాయి.

Russia is reducing subsidies on crude oil imports

రష్యా చమురు దిగుమతి 2022లో భారతదేశంలో పది రెట్లు పెరిగింది. రష్యా భారత్ కంపెనీలకు 30 డాలర్లకు పైగా డిస్కౌంట్ తో చమురు విక్రయించింది. ఆ తర్వాత క్రమంగా రాయితీ తగ్గిస్తూ వచ్చింది. ఇప్పడు రాయితీని 4 డాలర్లకు తగ్గించింది. అమెరికా, యూరప్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, రష్యా దిగుమతులపై పాశ్చాత్య ఆంక్షలకు కట్టుబడి ఉండటానికి భారత్ నిరాకరించింది. దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉందని, లక్షలాది మంది పేదరికంలో ఉన్నందున అధిక ధరలు చెల్లించే పరిస్థితి లేదని రష్యా నుంచి చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్ధించుకుంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందు 2 శాతం మాత్రమే రష్యా చమురును కొనుగోలు చేసిన కపెనీలు ఆ తర్వాత దిగుమతిని 44 శాతం పెంచాయి. కానీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, HPCL-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్, రిఫైనర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నయారా ఎనర్జీ లిమిటెడ్ రష్యాతో విడివిడిగా ఒప్పందాలను కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+