శశికళ ఖైదీ నెంబర్ 9934: జైలుకు రాకుండా లగ్జరీ హోటల్ లో దివాకరన్ !

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన శశికళకు ఖైదీ నెంబర్ 9934 కేటాయించారు. శశికళతో పాటు లొంగిపోయిన ఇళవరసికి ఖైదీ నెంబర్ 9935, సుధాకరన్‌కు 9936 నెంబర్ కేటాయించారు.

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన మరో దోషి దివాకరన్ పరప్పన అగ్రహార జైలుకు రాలేదు. ఆయన బెంగళూరు నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్ బసచేశారు. అయితే ఎప్పుడైనా దివాకరన్ జైలు ఆవరణంలోని ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారని శశికళ వర్గీయులు అంటున్నారు.

Sasikala Natarajan is prisoner number 10711.

దివాకరన్ కోర్టులో లొంగిపోకుంటే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి సిద్దంగా ఉన్నారు. అయితే కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన శశికళకు చేదుఅనుభవం ఎదురైయ్యింది.

30 ఏళ్లు జయలలిత దగ్గర ఉన్న శశికళ చివరికి అమ్మకు ద్రోహం చేశారని, ఇప్పుడు అధికారం కోసం తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి సిద్దం అయ్యారని జైలు బయట కార్యకర్తలు ఆందోళన చేశారు.

జయలలిత ఫోటోలు చేతపట్టుకుని శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శశికళ కచ్చితంగా బెంగూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష పూర్తి చేసుకుని వెలుతారని, ఆరోజుటికి చిన్నమ్మ అనే పేరు తమిళనాడులో తెరమరుగు అవుతుందని జయలలిత అభిమానులు జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+