'మసాలా వేశావుగా"..! కంగనా రనౌత్ కు సుప్రీం బిగ్ షాక్..!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు ఇవాళ సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. 2021లో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి పెట్టిన ట్వీట్ విషయంలో పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న కంగనాకు ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు కంగనా అప్పట్లో పెట్టిన ట్వీట్ పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

రైతులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో వృద్ధ నిరసనకారురాలు మహిందర్ కౌర్ గురించి కంగనా రనౌత్ ఒక పోస్ట్‌ను ఎక్స్ లో షేర్ చేశారు. ఆమె టైమ్ మ్యాగజైన్‌లో కనిపించిన "దాదీ" అని, ఆమె "100 రూపాయలకే దొరుకుతుందంటూ సెటైర్లు వేస్తూ ట్వీట్ షేర్ చేసారు. అయితే మహిందర్ కౌర్‌ను షాహీన్‌బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ దాదిగా భావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేశారు. అలాంటి నిరసనకారులు డబ్బు కోసం నిరసనల్లో పాల్గొంటారనే అర్దం వచ్చేలా కంగాన్ ఈ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర వివాదం రేగడంతో పాటు పరువునష్టం దావా కూడా దాఖలైంది.

SC Dismisses Kangana Ranaut s Defamation Petition Over Farmers Protest Tweet You Added Spice

ఈ పరువు నష్టం దావా కొట్టేయాలని కోరుతూ గతంలో కంగనా రనౌత్ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో కంగనా పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కంగనా కేవలం రైతులపై ట్వీట్ మాత్రమే చేయలేదని, అందులో తన మసాలా కూడా జోడించిందని ధర్మాసనం గుర్తుచేసింది.

SC Dismisses Kangana Ranaut s Defamation Petition Over Farmers Protest Tweet You Added Spice

పిటిషనర్ కంగనా తన వ్యాఖ్యలపై అప్పుడే వివరణ ఇచ్చారని, అలాగే పంజాబ్ లో విచారణకు హాజరయ్యే విషయంలో భద్రతా సమస్యలు ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. కంగనా తన వాదనను ట్రయల్ కోర్టు ముందే సమర్పించాలని సూచించింది. కంగనా ట్వీట్ పై వ్యాఖ్యలు చేసేందుకు తమను ప్రేరేపించవద్దంటూ ఆమె లాయర్ ను సున్నితంగా మందలించింది. చివరికి కంగనా పిటిషన్ ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+