Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NOTAకు ఎక్కువ ఓట్లొస్తే ఎన్నిక రద్దు -కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు -కీలక వాదనలు

దేశంలో వచ్చే ఏడాదే జమిలి ఎన్నికలు తప్పవనే ప్రచారం జోరందుకున్న వేళ.. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ఓటర్లు 'నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్)' ను ఎంచుకోవడం ద్వారా తమ తిరస్కృతిని తెలియజెప్పే అవకాశం ఉండగా, ఆ ఏర్పాటుకు సంబంధించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టులోనే.. నోటా కోరలు మరింత పెట్టాలన్న వాదనలు ఊపందుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

బీజేపీ నేత పిటిషన్..

బీజేపీ నేత పిటిషన్..

భారత ఎన్నికల ప్రక్రియలో నోటా ప్రవేశించి 11ఏళ్లు కావస్తున్నా, ఆ ఆప్షన్ కు ఇప్పటికీ సరైన విలువ లేకుండాపోయింది. ఓటర్లు నోటా బటన్ నొక్కడం ద్వారా ఎవరికీ ఓటేయనట్లు అవుతుందేగానీ, సదరు ఆప్షన్ ఆయా పార్టీలు, అభ్యర్థుల పట్ల వ్యతిరేకతకు గుర్తుగా పరిగణించే వ్యవస్థేదీ ప్రస్తుతానికి లేదు. కాగా, నోటాను కేవలం తిరస్కరించే హక్కుగా కాకుండా, దానికొక గుర్తింపును కూడా కల్పించాలంటూ బీజేపీకి చెందిన ప్రముఖ నేత, న్యాయవాది అశ్వనీ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నోటాకు ఎక్కువ వస్తే పోల్ రద్దు

నోటాకు ఎక్కువ వస్తే పోల్ రద్దు

నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే గనుక ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసి తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా ఈసీని ఆదేశించాలంటూ అశ్వనీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. దీనిని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఏఎస్ బోప‌న్న‌, జ‌స్టిస్ వి రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. అశ్వనీ కుమార్ తరఫున కుమార్ తరఫున సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌నేకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి..

ఆ నిబంధనకు పదును పెట్టాలి..

ఆ నిబంధనకు పదును పెట్టాలి..

ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుందని, 50 శాతం నోటా ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్న నిబంధ‌న ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది గురుస్వామి గుర్తుచేశారు. నిజానికి.. నోటా ప్రవేశపెట్టిన స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉందని, ఏదైనా ఎన్నికలో 99 శాతం మంది ఓటర్లు అభ్య‌ర్థిని తిరస్క‌రించి, ఒక్క శాతం మంది ఓటర్లు ఓటేసినా ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారని, కాబట్టే, నోటాకు ఎక్కువ ఓట్లోస్తే ఎన్నికను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నట్లు గురుస్వామి తెలిపారు. దీనిపై..

కేంద్రం, ఈసీకి నోటీసులు

కేంద్రం, ఈసీకి నోటీసులు

పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసం.. నోటా వల్ల తలెత్తే పరిణామాలను రాజ్యాంగ స‌మ‌స్య‌గా అభివర్నించింది. ''ఒక‌వేళ నోటా కార‌ణంగా అంద‌రు అభ్య‌ర్థులు తిరస్క‌ర‌ణ‌కు గురైతే, ఆ నియోజ‌క‌వ‌ర్గానికి అస‌లు ప్రాతినిధ్య‌మే ఉండ‌దు క‌దా. అలాంట‌ప్పుడు స‌రైన పార్ల‌మెంట్‌ను ఎలా ఏర్పాటుచేయ‌గ‌లం? కాబట్టి దీన్ని విస్తృతంగా చర్చించాల్సిన అంశంగా మేం భావిస్తున్నాం. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికను రద్దు చేయాలన్న అంశంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర (న్యాయ శాఖకు) ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇస్తున్నాం'' అని సీజేఐ బెంచ్ పేర్కొంది. సుప్రీం నోటీసులపై కేంద్రం, ఈసీ ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+