హైప్రొఫైల్ సెక్స్ రాకెట్లో యువకులు, ముగ్గురు గర్ల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గోమతీనగర్ ప్రాంతంలో ప్రముఖులు నివసిస్తారు. ఈ ప్రాంతంలో ఈ సెక్స్ రాకెట్‌ను రట్టు చేసిన పోలీసులు తొమ్మిది మంది యువకులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన స్థలం నుండి భారీ మద్యం తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన తొమ్మిది మంది యువకులలో ఓ ప్రముఖుడి తనయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గోమతీనగర్‌లోని ఈ ఫ్లాట్‌లో దాదాపు ఏడాది నుండి సెక్స్ రాకెట్ నడుస్తోందట. సోమవారం ఉదయం మద్యం మత్తులో ఓ యువకుడు అర్ధనగ్నంగా బయటకు వచ్చాడట. ఇది చూసిన సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, మూడు రోజుల క్రితం కాన్పూర్‌లో పోలీసులు సెక్స్ రాకెట్ రట్టు చేశారు. పదిమంది యువకులను, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications