విజయ్ ను చూసి ఆనందం పట్టలేక..! వైకో ఇంట్లో పనిమనుషుల వీడియో వైరల్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్(Vijay)..ఇవాళ పలువురు రాజకీయ నేతల ఇళ్లకు వెళ్తున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంతో పాటు అన్నాడీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే అధినేత వైకో ఇంటికి కూడా వెళ్లారు. అయితే స్టాలిన్ నివాసంలో విజయ్ తో జరిగిన భేటీ కాస్త గంభీరంగా కనిపించింది. ఆ తర్వాత వైకో ఇంటికి విజయ్ వెళ్లినప్పుడు మాత్రం ఉద్వేగ భరిత సన్నివేశాలు కనిపించాయి.

విజయ్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..! కీలక వ్యాఖ్యలు..!
విజయ్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..! కీలక వ్యాఖ్యలు..!

ముందుగా విజయ్ వైకో నివాసానికి వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. విజయ్ తో కరచాలనం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వైకో సహా ఆయన కుటుంబ సభ్యులంతా విజయ్ తో ఫొటోలు కూడా దిగారు. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. విజయ్ ను చూడగానే వైకో ఇంట్లో పని మనుషులు సంతోషంలో మునిగిపోయారు. వెంటనే విజయ్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లను వైకోతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వారించలేదు.

She Saw CM Vijay at Vaiko s Home and Forgot Everything Else Watch What Happened Next- viral video
విజయ్ రాకపై స్టాలిన్ ట్వీట్..! ఆ సలహా ఇచ్చా..!
విజయ్ రాకపై స్టాలిన్ ట్వీట్..! ఆ సలహా ఇచ్చా..!

దీంతో సదరు పని మనుషులు విజయ్ వద్దకు చేరుకుని ఆయనకు నమస్కరించారు. విజయ్ ను చూసిన ఆనందం వాళ్ల కళ్లలో కనిపించింది. అందులో ఒకరు విజయ్ కు దిష్టి తీశారు. దీంతో విజయ్ కూడా ప్రతిగా తన చేతుల్ని తలకు పెట్టుకుని వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం వారిలో ఒకరిద్దరు విజయ్ కాళ్లకు నమస్కరించారు కూడా. దీంతో విజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం పనిమనుషులను కూడా వైకో కుటుంబ సభ్యుల తరహాలోనే ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. వారితో కలిసి ఫొటోలు దిగి వారికి మరపురాని రోజును అందించారు. విజయ్ అంటే ఏంటో మరోసారి నిరూపించారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+